బ్రహ్మీని కాపీ కొట్టిన సమంత పిక్స్ వైరల్.. చూస్తే మీరు కూడా నిజమే అంటారు..
దిశ, సినిమా: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్‌తో అలరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగిన లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మత్తెక్కించే వాయిస్, డీప్ మీనింగ్‌తో చంద్రబోస్ అందించిన లిరిక్స్, సమంత గ్లామర్ షో, దేవి శ్రీ మ్యూజిక్ ప్రేక్షకులకు కిక్ ఇస్తుండగా.. ఈ సాంగ్ లిరికల్ వీడియోలో […]
దిశ, సినిమా: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్‌తో అలరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగిన లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మత్తెక్కించే వాయిస్, డీప్ మీనింగ్‌తో చంద్రబోస్ అందించిన లిరిక్స్, సమంత గ్లామర్ షో, దేవి శ్రీ మ్యూజిక్ ప్రేక్షకులకు కిక్ ఇస్తుండగా.. ఈ సాంగ్ లిరికల్ వీడియోలో సమంత డ్యాన్స్ స్టెప్స్‌పై మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
‘అనగనగా ఒక రోజు’ సినిమాలో ‘నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా.. ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా’ అంటూ బ్రహ్మానందం పలికించే హావభావాలలాగే ఉన్నాయంటున్నారు మీమర్స్. ‘బ్రహ్మి : నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా.. సామ్ : నేను మరీ అంత కత్తిలా కనిపిస్తున్నానా’ అనే మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ.. ‘బ్రహ్మీ సార్ మీ స్టైల్‌ను సామ్ కాపీ కొట్టింది. ఆమెపై కేసు పెట్టండి. ట్రెండ్ సెట్టర్ బ్రహ్మీతో పోలిస్తే మీరంతా జుజుబీ’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
సామ్‌తో విడాకులపై స్పందించిన చై.. అదే నిజమా..?