రాము అంటే శర్వానే: సమంత
సమంత అక్కినేని నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటుంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి… మజిలీ, ఓ బేబి లాంటి యాక్టింగ్ బేస్డ్ రోల్స్ ఎంచుకుంది. ఆ తర్వాత సమంత నుంచి వస్తున్న మరో చిత్రం జాను. తమిళ సినిమా 96 రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఒక ప్రేమ కథా కావ్యం. ఒక మంచి ప్రేమ నవలను చదివితే ఎంత బాగుంటుందో ఈ సినిమాను […]
సమంత అక్కినేని నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటుంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి… మజిలీ, ఓ బేబి లాంటి యాక్టింగ్ బేస్డ్ రోల్స్ ఎంచుకుంది. ఆ తర్వాత సమంత నుంచి వస్తున్న మరో చిత్రం జాను. తమిళ సినిమా 96 రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఒక ప్రేమ కథా కావ్యం. ఒక మంచి ప్రేమ నవలను చదివితే ఎంత బాగుంటుందో ఈ సినిమాను చూస్తే అంతకు మించిన అనుభూతి కలుగుతుందట. 96 సినిమాతో త్రిష, విజయ్ సేతుపతి కోలీవుడ్‌లో మ్యాజిక్ క్రియేట్ చేయగా అదే మ్యాజిక్‌ను టాలీవుడ్‌లో క్రియేట్ చేయబోతున్నారు సమంత, శర్వానంద్.
రాము, జాను పాత్రలో తెరపై తమ నిస్వార్ధమైన, పవిత్రమైన ప్రేమను చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాకు హైప్ తీసుకువచ్చింది కూడా. ఎక్కడ చూసిన ఊహలే ఊహలే సాంగ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో వీరిద్దరి సామ్, శర్వాల పాత్రలు, నటన కీలకం అని చెబుతోంది సామ్. ఒకరి నటనపై మరొకరి నటన ఆధారపడి ఉంటుందని, అందుకే మంచి ఔట్‌పుట్ వచ్చేందుకు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నామని చెప్పింది. ఇక రాము పాత్రలో శర్వాని తప్ప మరొకరిని ఊహించుకోలేనంది. హార్ట్ టచింగ్, ఫీల్ గుడ్‌లవ్‌తో వస్తున్న సినిమాలో శర్వా లేకుంటే మ్యాజిక్ క్రియేట్ అయ్యేది కాదని చెబుతోంది. షూటింగ్ తొలిరోజు నుంచే మ్యాజిక్ క్రియేట్ అయిందని, అది కంటిన్యూ అవుతుందని తెలిపింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన చిత్రానికి సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. గోవింద్ వసంత అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. శుక్రవారం రోజున సినిమా విడుదల కానుంది.