ఫస్ట్ లవ్‌ అంత ఈజీగా మరిచిపోలేను : సమంత

దిశ, సినిమా: బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ సమంత అక్కినేని టాలీవుడ్‌లో అడుగుపెట్టి అప్పుడే 11 ఏళ్లు పూర్తయ్యాయి. ‘ఏ మాయ చేశావే సినిమా’ ద్వారా తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన భామ.. అందం, అల్లరి, చిలిపితనంతో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. గ్లామరస్ హీరోయిన్‌గా ఎంటరైనా, అంచెలంచెలుగా ఎదుగుతూ పర్‌ఫెక్ట్ యాక్ట్రెస్‌గా ప్రూవ్ చేసుకుంది. పెళ్లి తర్వాత ఫిమేల్ లీడ్ సినిమాలు చేస్తూ శభాష్ అనిపించుకుంటోంది. కాగా 11 ఇయర్స్ యానివర్సరీ జరుపుకుంటున్న సామ్ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ […]

Update: 2021-02-26 06:20 GMT

దిశ, సినిమా: బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ సమంత అక్కినేని టాలీవుడ్‌లో అడుగుపెట్టి అప్పుడే 11 ఏళ్లు పూర్తయ్యాయి. ‘ఏ మాయ చేశావే సినిమా’ ద్వారా తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన భామ.. అందం, అల్లరి, చిలిపితనంతో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. గ్లామరస్ హీరోయిన్‌గా ఎంటరైనా, అంచెలంచెలుగా ఎదుగుతూ పర్‌ఫెక్ట్ యాక్ట్రెస్‌గా ప్రూవ్ చేసుకుంది. పెళ్లి తర్వాత ఫిమేల్ లీడ్ సినిమాలు చేస్తూ శభాష్ అనిపించుకుంటోంది. కాగా 11 ఇయర్స్ యానివర్సరీ జరుపుకుంటున్న సామ్ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది.

‘సినిమా ఫస్ట్ లవ్.. అంత త్వరగా మరిచిపోలేము.. హ్యాపీ యానివర్సిరీ టు మి అండ్ ఆల్ అఫ్ యూ టూ.. మీరు లేకుండా ఇదంతా జరిగి ఉండేది కాదు’ అంటూ థాంక్స్ చెప్పింది. తనలో తాను చూడని సమ్‌థింగ్ బెస్ట్‌ను దర్శకులు గౌతమ్ మీనన్ చూడటం, ‘ఏ మాయ చేశావే’లో చాన్స్ ఇవ్వడంపై ధన్యవాదాలు తెలిపింది. నాగ చైతన్యతో పాటు ప్రేక్షకులందరూ కూడా తనను ప్రపంచంలోనే హ్యాపియెస్ట్ ఉమన్‌గా మార్చారని థాంక్స్ చెప్పింది సామ్.

Tags:    

Similar News