మేమే చెబుతున్నాం.. సిద్ధిపేటలో కటింగ్ షాపులు బంద్

దిశ,సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో సిద్దిపేట జిల్లాలో ఉన్న పలు మండలాలలో వివిధ వ్యాపార సంస్థలు, వృత్తిదారులు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వృత్తిదారులు కూడా వివిధ మండలాల నుంచి మాకు ఫోన్ చేసి మనం కూడా స్వచ్ఛందంగా లాక్ డౌన్ కు పోతే బాగుంటుందని తెలియజేశారని, వారి సూచనలు, అభిప్రాయాల మేరకు రేపటి నుండి నాయి బ్రాహ్మణ వృత్తి దారులందరూ స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించనున్నట్లు వారు తెలిపారు. […]

Update: 2020-07-19 02:02 GMT

దిశ,సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో సిద్దిపేట జిల్లాలో ఉన్న పలు మండలాలలో వివిధ వ్యాపార సంస్థలు, వృత్తిదారులు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వృత్తిదారులు కూడా వివిధ మండలాల నుంచి మాకు ఫోన్ చేసి మనం కూడా స్వచ్ఛందంగా లాక్ డౌన్ కు పోతే బాగుంటుందని తెలియజేశారని, వారి సూచనలు, అభిప్రాయాల మేరకు రేపటి నుండి నాయి బ్రాహ్మణ వృత్తి దారులందరూ స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించనున్నట్లు వారు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత కూడా స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ వినియోగదారులకు సేవలు అందించనున్నట్లు వారు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాలూరిసుధాకర్‌, ఉపాధ్యక్షులు నర్సింలు, స్వామి, రాష్ట్రఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్రసహాయకార్యదర్శి కిషన్‌, అదికారప్రతినిది విధ్యాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News