సాహస ‘సలేశ్వరం యాత్ర’ రద్దు

దిశ, మహబూబ్‌గర్: నల్లమల అడవుల్లో సాహసోపేతంగా జరిగే సలేశ్వరం యాత్రకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి యాత్రను అధికారులు రద్దు చేశారు. జాతర నిర్వహిస్తే వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఏడాది యాత్రను రద్దు చేయడం జరిగిందని నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆనవాయితీ ప్రకారం బుధవారం నాడు జాతర ప్రారంభం కావడంతో కేవలం ఇద్దరు చెంచులు మాత్రమే లోయలోకి వెళ్ళి స్వామి వారికి ప్రత్యేక […]

Update: 2020-04-09 06:47 GMT

దిశ, మహబూబ్‌గర్: నల్లమల అడవుల్లో సాహసోపేతంగా జరిగే సలేశ్వరం యాత్రకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి యాత్రను అధికారులు రద్దు చేశారు. జాతర నిర్వహిస్తే వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఏడాది యాత్రను రద్దు చేయడం జరిగిందని నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆనవాయితీ ప్రకారం బుధవారం నాడు జాతర ప్రారంభం కావడంతో కేవలం ఇద్దరు చెంచులు మాత్రమే లోయలోకి వెళ్ళి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జాతర విశిష్ఠత

ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమికి జరిగే ఈ యాత్రలో భక్తులు ఎత్తైన కొండలు ఎక్కి దిగుతూ ఐదురోజుల పాటు శివయ్యను దర్శించుకుంటారు. ఈ యాత్రకు భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా తరలివస్తారు. దట్టమైన అడవిలో ప్రకృతి అందాల మధ్య జరిగే సలేశ్వరం జాతరకు 15రోజుల ముందు అక్కడి చెంచులు ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. యాత్ర చేసే సమయంలో కాలిబాటన వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి. మండు వేసవిలో జాలువారే జలపాతాలు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నీటిగుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి. కష్టమైనా ఇష్టంగా సలేశ్వరం చేరుకుని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు మొక్కును తీర్చుకుంటారు.

Tags: Saleshwaram Yatra cancel, Mallikarjuna Swamy, Nallamala forest, Nagarkool collector, AP, Telangana, Maharastra,

Tags:    

Similar News