సమ్మర్ స్పెషల్.. గిదే పేదోడి ఫ్రిజ్
దిశ, జనగామ: దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి సీజన్ సమీపిస్తుండడంతో చల్లని నీటి కోసం జనం తాపత్రయపడడం సహజమే. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రంజన్ కుండల వ్యాపారం మొదలైంది. తక్కువ సమయంలో నీటిని చల్లబరిచే ఈ రంజన్‌పై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు వ్యాపారులు రాజస్థాన్ నుంచి రంజన్లు తెప్పించి జనగామలో అమ్ముతున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఆరోగ్య రీత్యా ఫ్రిజ్ నీటికంటే కుండ నీరుతాగడం మంచిదని వైద్యులు సూచిస్తుండడంతో […]
దిశ, జనగామ: దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి సీజన్ సమీపిస్తుండడంతో చల్లని నీటి కోసం జనం తాపత్రయపడడం సహజమే. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రంజన్ కుండల వ్యాపారం మొదలైంది. తక్కువ సమయంలో నీటిని చల్లబరిచే ఈ రంజన్‌పై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు వ్యాపారులు రాజస్థాన్ నుంచి రంజన్లు తెప్పించి జనగామలో అమ్ముతున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఆరోగ్య రీత్యా ఫ్రిజ్ నీటికంటే కుండ నీరుతాగడం మంచిదని వైద్యులు సూచిస్తుండడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. రాజస్థాన్ రంజన్లు ఒక్కొక్కటి రూ.300కు విక్రయిస్తుండగా స్థానికంగా తయారు చేసిన రంజన్లు రూ.150 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా కరోనా వైరస్ వలన ప్రజల కంటే మట్టితో తయారు చేసిన కుండలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.