తెలంగాణతో ఎలాంటి వివాదం లేదు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఏమీ లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలు-ఉభయ రాష్ట్రాల వినియోగం- ఏపీ హక్కులు అనే అంశంపై శనివారం వర్చువల్ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో మాట్లాడిన సజ్జల తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. రాయలసీమకు నీళ్లిస్తామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆరే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి […]

Update: 2021-07-10 11:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఏమీ లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలు-ఉభయ రాష్ట్రాల వినియోగం- ఏపీ హక్కులు అనే అంశంపై శనివారం వర్చువల్ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో మాట్లాడిన సజ్జల తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. రాయలసీమకు నీళ్లిస్తామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆరే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోందన్నారు. కృష్ణా జలాలపై ఎలాంటి వివాదం లేకపోయినా రాజకీయ కోణంలో వివాదం సృష్టిస్తోందని ఆరోపించారు. కృష్ణా నదీ జలాల కేటాయింపులు ప్రాజెక్టుల వారీగా జరిగాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని అన్ని వేదికలపైనా లేవనెత్తుతామని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

రాయలసీమ ఎత్తిపోతలపై దుష్ప్రచారం ఆపండి-మంత్రి అనిల్ కుమార్ యాదవ్

కృష్ణా జలాల విషయంలో విభజన సమయ ఒప్పందానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడాలని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగాలని ఆకాంక్షించారు. పొరుగు రాష్ట్రాలతో తాము సత్సంబంధాలే కోరుతామన్నారు. కృష్ణా జలాల్లో కేటాయింపు కంటే ఎక్కువ నీటి వినియోగం చేయడం తెలంగాణ ప్రభుత్వానికి తగదన్నారు. ఏపీ ప్రభుత్వం కేటాయింపుల కంటే ఎక్కువ నీరు తీసుకోవట్లేదని స్పష్టం చేశారు. అలాగే రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. శ్రీశైలంలో 850 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా.. 44వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం సాధ్యమని అనిల్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News