కరీంనగర్ జిల్లాపై సాయిరెడ్డిది చెరగని ముద్ర

దిశ,హుజురాబాద్: రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతి తీరని లోటని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్ పీ చైర్మన్ గా పనిచేసి రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, హుజురాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభ లో అడుగుపెట్టి తనదైన శైలితో ప్రజలకు చేరువయ్యారని కొనియాడారు. […]

Update: 2021-04-22 23:14 GMT

దిశ,హుజురాబాద్: రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతి తీరని లోటని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్ పీ చైర్మన్ గా పనిచేసి రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, హుజురాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభ లో అడుగుపెట్టి తనదైన శైలితో ప్రజలకు చేరువయ్యారని కొనియాడారు. రాజకీయాల్లో హుందాతనంతో వ్యవహరించిన సాయిరెడ్డి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. శుక్రవారం హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో సాయిరెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. సాయిరెడ్డి మృతిపట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సాయిరెడ్డి మృతి తో నేడు హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

సాయి రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం

సాయి రెడ్డి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకార్. అలాగే శుక్రవారం లేదా శనివారం హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలో లో అంత్యక్రియలు జరిగే అవకాశాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News