‘వన్ డే వన్ స్టోరీ’ చెప్పిన సైఫ్..

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్.. టాలెంటెడ్ రైటర్ అండ్ రీడర్ కూడా. ఆయనకు పుస్తకాల పట్ల ఉన్న అభిరుచి, కళాకారుడిగా తను చేసే పనిని ప్రతిబింబిస్తుందని అంటుంటారు. సైఫ్ సినిమాలను ఎంతగా ప్రేమిస్తాడో.. పుస్తకాలనూ అంతే ఇష్టపడతాడని ఆయన ఇంటర్వ్యూలు చూస్తేనే అర్థమవుతుంది. పుస్తకాలు కేవలం చదవడానికి మాత్రమే కాదు, లైఫ్‌లో చాలా నేర్చుకునేందుకు, ఉన్నతంగా ఎదిగేందుకు సహాయపడతాయని నమ్మే సైఫ్.. దేశంలో అక్షరాస్యతను పెంచేందుకు పనిచేస్తున్న ఎన్జీఓ సంస్థతో చేతులు […]

Update: 2020-09-10 03:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్.. టాలెంటెడ్ రైటర్ అండ్ రీడర్ కూడా. ఆయనకు పుస్తకాల పట్ల ఉన్న అభిరుచి, కళాకారుడిగా తను చేసే పనిని ప్రతిబింబిస్తుందని అంటుంటారు. సైఫ్ సినిమాలను ఎంతగా ప్రేమిస్తాడో.. పుస్తకాలనూ అంతే ఇష్టపడతాడని ఆయన ఇంటర్వ్యూలు చూస్తేనే అర్థమవుతుంది. పుస్తకాలు కేవలం చదవడానికి మాత్రమే కాదు, లైఫ్‌లో చాలా నేర్చుకునేందుకు, ఉన్నతంగా ఎదిగేందుకు సహాయపడతాయని నమ్మే సైఫ్.. దేశంలో అక్షరాస్యతను పెంచేందుకు పనిచేస్తున్న ఎన్జీఓ సంస్థతో చేతులు కలిపారు. అంతేకాదు సదరు ఎన్జీఓకు మద్దతుగా చిన్నారుల కోసం ఓ స్పెషల్ స్టోరీ చెప్పడం విశేషం.

Full View

పిల్లల పుస్తక ప్రచురణకర్త ‘ప్రథమ్ బుక్స్‌’తో కలిసి ‘వన్‌డే వన్ స్టోరీ’ అనే ఆసక్తికరమైన కథ వినిపించాడు సైఫ్. ‘ద గర్ల్ హు కుడ్ నాట్ స్టాప్ లాఫింగ్(నవ్వడం ఆపలేకపోతున్న అమ్మాయి)’ కథను తనదైన శైలిలో చమత్కారంగా చెప్పారు. నవ్వడం ఎన్ని రకాలు.. ఎలాంటప్పుడు ఎలా నవ్వుతాం.. అసలు కథలో ఉన్న అమ్మాయి ఎందుకు నవ్వింది? అంటూ చాలా చక్కగా వివరించిన సైఫ్.. ప్రేక్షకులను కట్టిపడేశాడు. స్టోరీ అనేది కేవలం వినోదానికి మూలంగా ఉండకుండా.. ఒక సందేశాన్ని ఇవ్వాలని, పిల్లలకు సమాచార విద్యగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

కాగా సైఫ్.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో లంకేశ్వరుడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఓమ్ రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు..

Read Also…

పియా రియా అవుతుంది సరే.. నీ సంగతేంటి?

Full View

Tags:    

Similar News