కరోనా కట్టడి ఎలానో చెప్పిన సైదిరెడ్డి

దిశ, హుజూర్ నగర్: స్వీయ నియంత్రణ ద్వారా కరోనాను అరికట్టవచ్చని నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ప్రజలు తమ అవసరాల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు, శానిటరైర్లు తప్పకుండా వాడాలని సూచించారు. హుజుర్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ తో పాటు, నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేశామని, అత్యవసర సమయంలో ఆక్సిజన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజులలో కరోనా బాధితుల […]

Update: 2020-08-30 03:53 GMT

దిశ, హుజూర్ నగర్: స్వీయ నియంత్రణ ద్వారా కరోనాను అరికట్టవచ్చని నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ప్రజలు తమ అవసరాల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు, శానిటరైర్లు తప్పకుండా వాడాలని సూచించారు. హుజుర్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ తో పాటు, నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేశామని, అత్యవసర సమయంలో ఆక్సిజన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

రాబోయే రెండు, మూడు రోజులలో కరోనా బాధితుల కోసం అంబులెన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. మనకోసం నిరంతరం శ్రమించే ఆరోగ్య, పారిశుధ్య అధికారులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కరోనాను ఎదుర్కోవడంలో అధికారులకు ఏ సమయంలోనైనా నేను అందుబాటులో ఉంటానని తెలిపారు.

Tags:    

Similar News