మరోసారి రాశీ, తేజ్ కాంబినేషన్

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘సుప్రీం’, ‘ప్రతి రోజూ పండగే’ చిత్రాలతో సక్సెస్ అందుకున్నఈ జంట మరోసారి జతకట్టబోతోంది. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్… కొత్తగా దేవకట్టా దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేసిన ఈ సినిమాలో నివేద పేతురాజ్ హీరోయిన్. అయితే ఇందులో మరో ముఖ్యపాత్ర కోసం మరోసారి రాశీ ఖన్నానే […]

Update: 2020-03-14 07:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘సుప్రీం’, ‘ప్రతి రోజూ పండగే’ చిత్రాలతో సక్సెస్ అందుకున్నఈ జంట మరోసారి జతకట్టబోతోంది. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్… కొత్తగా దేవకట్టా దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేసిన ఈ సినిమాలో నివేద పేతురాజ్ హీరోయిన్. అయితే ఇందులో మరో ముఖ్యపాత్ర కోసం మరోసారి రాశీ ఖన్నానే ఎంచుకున్నాడట తేజ్. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం .. ఈ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నారట. సినిమాలో రాశీ, తేజ్‌ల మధ్య ఒక డ్యుయెట్, కొన్ని సీన్లు ఉంటాయని సమాచారం.

సుబ్బు దర్శకత్వంలో వస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా నభా నటేష్ కనిపించబోతోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు .. ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Tags: Sai Dharam Tej, Rashi Khanna, Deva Katta Movie, Nivetha Pethuraj

Tags:    

Similar News