ఐసీయూలో సాయితేజ్.. గబ్బర్ సింగ్ డైరెక్టర్ సంచలన ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్డి వద్ద యంగ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌ మీదనుంచి అతివేగంగా వచ్చి స్కిడ్‌ అయి గాయాపాలయ్యాడు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే.. సాయి తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. అంతేకాదు యాక్సిడెంట్‌ విషయం తెలిసి నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యంపై వైద్యులను అడిగి […]

Update: 2021-09-11 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్డి వద్ద యంగ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌ మీదనుంచి అతివేగంగా వచ్చి స్కిడ్‌ అయి గాయాపాలయ్యాడు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే.. సాయి తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. అంతేకాదు యాక్సిడెంట్‌ విషయం తెలిసి నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ ట్వీట్‌లో ‘‘హాట్స్ ఆఫ్ తమ్ముడు. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ యాక్సిడెంట్ వంకతో తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరూ బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలని కోరుకుంటున్నాను.’’ అని కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి ఆసక్తికర పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News