దివంగత దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్.. పోస్టర్ రిలీజ్!

దిశ, సినిమా: దివంగత మాలీవుడ్ దర్శకుడు సాచి తెరకెక్కించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన స్నేహితుడు, నటుడు అయిన పృథ్వీరాజ్.. సాచి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘విలయత్ బుద్ధ’ పోస్టర్‌ రిలీజ్ చేశారు. సాచి తన మరణానికి ముందు దర్శకత్వం వహించాలనుకున్న సినిమా ఇదేనని తెలిపారు. తన జ్ఞాపకార్థం తెరమీదకు తీసుకొస్తున్న ఈ చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహించబోతున్నట్లు సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు. ఊర్వశి థియేటర్స్ సమర్పణలో […]

Update: 2021-02-07 04:00 GMT

దిశ, సినిమా: దివంగత మాలీవుడ్ దర్శకుడు సాచి తెరకెక్కించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన స్నేహితుడు, నటుడు అయిన పృథ్వీరాజ్.. సాచి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘విలయత్ బుద్ధ’ పోస్టర్‌ రిలీజ్ చేశారు. సాచి తన మరణానికి ముందు దర్శకత్వం వహించాలనుకున్న సినిమా ఇదేనని తెలిపారు. తన జ్ఞాపకార్థం తెరమీదకు తీసుకొస్తున్న ఈ చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహించబోతున్నట్లు సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు. ఊర్వశి థియేటర్స్ సమర్పణలో సందీప్ సేనన్, అనీష్ ఎం థామస్ నిర్మిస్తున్న సినిమాకు ఇందు గోపన్, రాజేశ్ స్క్రిప్ట్ అందించారు.

కాగా ‘విలయత్ బుద్ధ’ కథ మొత్తం భాస్కరన్ మాస్టర్, తన స్టూడెంట్ డబుల్ మోహనన్ చుట్టూ తిరుగుతుంది. భాస్కరన్ వ్యక్తిగత కారణాల కోసం ‘విలయత్ బుద్ధ’ అనే గంధపు చెట్టును తన ఇంటి పరిసరాల్లో పెంచుతాడు. ప్రీమియమ్ ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ ఉన్న ‘విలయత్ బుద్ధ’ను తన శిష్యుడు, స్మగ్లర్ అయిన మోహనన్‌ నరికేస్తానని చాలెంజ్ చేస్తాడు. మాస్టర్, స్టూడెంట్‌ల మధ్య గొడవ, ప్రతీకార యుద్ధమే కథ కాగా.. స్టూడెంట్ మోహనన్‌గా పృథ్వీరాజ్ నటించబోతున్నారు. మాస్టర్ భాస్కరన్ క్యారెక్టర్‌కు కూడా యాక్టర్‌ ఫైనల్ అయ్యారని, త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాడు డైరెక్టర్ జయన్ నంబియార్. కాగా పృథ్వీ ప్రస్తుతం ‘బ్రహ్మమ్’, ‘తీర్పు’, ‘కురుతి’, ‘జనగణమన’ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Tags:    

Similar News