కేబీసీలో తెలంగాణ యువతి.. బిగ్ బీ భావోద్వేగం!
దిశ, వెబ్‌డెస్క్: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆ షో 11 సీజన్లు విజయంవంతంగా ముగించుకొని, 12వ సీజన్‌లో అడుగుపెట్టింది. అయితే రెండోవారం (మంగళవారం) ప్రసారమవుతున్న షోలో మన తెలంగాణ, సికింద్రాబాద్ నుంచి కంప్యూటర్ టీచర్ సబితా రెడ్డి పాల్గొంది. కాగా ఆమె లైఫ్ జర్నీకి బిగ్ బీ కూడా ఎమోషనల్ అయ్యారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో ఉండే సబిత కంప్యూటర్ టీచర్‌గా పనిచేస్తున్నారు. భర్త చనిపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ […]
దిశ, వెబ్‌డెస్క్: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆ షో 11 సీజన్లు విజయంవంతంగా ముగించుకొని, 12వ సీజన్‌లో అడుగుపెట్టింది. అయితే రెండోవారం (మంగళవారం) ప్రసారమవుతున్న షోలో మన తెలంగాణ, సికింద్రాబాద్ నుంచి కంప్యూటర్ టీచర్ సబితా రెడ్డి పాల్గొంది. కాగా ఆమె లైఫ్ జర్నీకి బిగ్ బీ కూడా ఎమోషనల్ అయ్యారు.
సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో ఉండే సబిత కంప్యూటర్ టీచర్‌గా పనిచేస్తున్నారు. భర్త చనిపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ తనమీదనే పడ్డాయి. అయినా కష్టాలకు వెరవకుండా కుటుంబాన్ని పోషిస్తోంది. తన సొంత కుటుంబం కూడా ఆమెతో బంధాన్ని తెంచుకోగా ఆమె మాత్రం తనపై తనకున్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. కాగా, తన ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి, తన లోన్లను తీర్చడానికి కేబీసీ వేదికపైకి వచ్చినట్లు ఆమె తెలిపింది. అంతేకాదు, తన తల్లిదండ్రులను ఈ షో ద్వారా మళ్లీ కలవాలని ఆశించింది. కాగా, తన భర్తకు పెరాలిసిస్ వచ్చినపుడు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సబిత తనను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ సరైన ట్రీట్మెంట్ దొరకకపోవడంతో.. అతడు బ్రెయిన్ హెమరేజ్( brain haemorrhage)తో చనిపోయాడు.