ఆ కాలనీకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు.. ఇది ప్రజలకు శాపమేనా?

దిశ, జల్‌పల్లి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సబితా ఇంద్రారెడ్డి కాలనీకి వెళ్లే రహదారిలో మరమ్మత్తు పనులు చేపట్టాలని మాజీ ఎంపీటీసీ షేక్ అఫ్జల్ కోరారు. కొద్దిపాటి వర్షం కురిసినా మట్టి రోడ్డు పూర్తిగా నీట మునిగి బురద మయంగా మారుతోందన్నారు. దీంతో కాలనీలోకి వచ్చే పాదచారులు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. కాలనీ ఎంట్రన్స్‌లో అయితే, పరిస్థితి మరింత దారుణంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్‌పల్లి మున్సిపల్ […]

Update: 2021-10-03 07:07 GMT

దిశ, జల్‌పల్లి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సబితా ఇంద్రారెడ్డి కాలనీకి వెళ్లే రహదారిలో మరమ్మత్తు పనులు చేపట్టాలని మాజీ ఎంపీటీసీ షేక్ అఫ్జల్ కోరారు. కొద్దిపాటి వర్షం కురిసినా మట్టి రోడ్డు పూర్తిగా నీట మునిగి బురద మయంగా మారుతోందన్నారు. దీంతో కాలనీలోకి వచ్చే పాదచారులు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. కాలనీ ఎంట్రన్స్‌లో అయితే, పరిస్థితి మరింత దారుణంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి సబితా ఇంద్రారెడ్డి కాలనీలోని బురద రోడ్లకు మరమ్మత్తు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News