పోలీసులను ఆశ్రయించిన ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్
సోషల్ మీడియాలో కేటుగాళ్లు ఎక్కువైపోతున్నారు. సినిమా చాన్స్‌లు ఇప్పిస్తామంటూ అందమైన అమ్మాయిల డీటెయిల్స్ కలెక్ట్ చేసి అప్రోచ్ అవుతున్నారు. ఈ మధ్య రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పి అమ్మాయిలను వేధించిన విషయం తెలిసిందే. ఈ కేసు కాస్త సాల్వ్ కాగా, తాజాగా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి పేరు చెప్పి అమ్మాయిల వివరాలు సేకరించాడు ఓ కేటుగాడు. వాట్సప్‌లో చాటింగ్ చేస్తూ విజయ్ దేవరకొండ, విశాల్‌లతో సినిమా చాన్స్ ఇప్పిస్తానని నమ్మించి, వారి […]
సోషల్ మీడియాలో కేటుగాళ్లు ఎక్కువైపోతున్నారు. సినిమా చాన్స్‌లు ఇప్పిస్తామంటూ అందమైన అమ్మాయిల డీటెయిల్స్ కలెక్ట్ చేసి అప్రోచ్ అవుతున్నారు. ఈ మధ్య రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పి అమ్మాయిలను వేధించిన విషయం తెలిసిందే. ఈ కేసు కాస్త సాల్వ్ కాగా, తాజాగా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి పేరు చెప్పి అమ్మాయిల వివరాలు సేకరించాడు ఓ కేటుగాడు. వాట్సప్‌లో చాటింగ్ చేస్తూ విజయ్ దేవరకొండ, విశాల్‌లతో సినిమా చాన్స్ ఇప్పిస్తానని నమ్మించి, వారి నుంచి న్యూడ్ ఫోటోస్ సేకరించాడు. తర్వాత డబ్బులు ఇవ్వకపోతే, తనతో గడపకపోతే ఫొటోలు సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తానని భయటపెట్టడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం కాస్తా అజయ్ భూపతికి తెలియడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన పేరు చెప్పి అమ్మాయిలను బెదిరిస్తున్న వ్యక్తిని పట్టుకోవాలని ఫిర్యాదు చేశాడు.