హిందూ దేవాలయంలో పూజారిగా రష్యా మహిళ

దిశ, వెబ్‌డెస్క్ : ఓ మహిళ కులగోడలను, పురుషాధిక్యత భావజాలన్ని తొక్కిపడేసింది. శతాబ్ధాలుగా ఉన్న ఆచారాన్ని రూపుమాపింది. హిందూ దేవాలయంలో పూజారిగా చేరి.. భగవంతునికి భక్తుడికి అనుసంధానమై వార్తల్లో నిలిచింది. పూజారిగా మారిన రష్యా స్త్రీకి నెటిజన్లు పెద్దఎత్తున్న మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. సహజంగా మనం ఏ దేవాలయానికి వెళ్లిన అక్కడ పూజారి పురుషుడే ఉంటారు. అర్చనలు, పూజలు, మంత్రోశ్ఛరణలు, అభిషేకాలు అతనే చేస్తాడు. కానీ మస్కోలోని ఓ హిందూ దేవాలయంలో పాశ్చాత్య (రష్యా) బ్రాహ్మణేతర […]

Update: 2021-03-22 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఓ మహిళ కులగోడలను, పురుషాధిక్యత భావజాలన్ని తొక్కిపడేసింది. శతాబ్ధాలుగా ఉన్న ఆచారాన్ని రూపుమాపింది. హిందూ దేవాలయంలో పూజారిగా చేరి.. భగవంతునికి భక్తుడికి అనుసంధానమై వార్తల్లో నిలిచింది. పూజారిగా మారిన రష్యా స్త్రీకి నెటిజన్లు పెద్దఎత్తున్న మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

సహజంగా మనం ఏ దేవాలయానికి వెళ్లిన అక్కడ పూజారి పురుషుడే ఉంటారు. అర్చనలు, పూజలు, మంత్రోశ్ఛరణలు, అభిషేకాలు అతనే చేస్తాడు. కానీ మస్కోలోని ఓ హిందూ దేవాలయంలో పాశ్చాత్య (రష్యా) బ్రాహ్మణేతర మహిళా పూజారీగా పని చేస్తోంది. అక్కడికి వచ్చే హిందువులను సైతం ఆమె పూజాది కార్యక్రమాలు గావించి ఆశీర్వదిస్తోంది. హిందూ మతానికి చెందిన మగ వ్యక్తిని.. ఆ పాశ్చాత్య బ్రాహ్మణేతర మహిళా పూజారీ శఠగోపంతో ఆశీర్వదిస్తున్న ఫొటో अखण्ड भारत @Sandy49363539 పేరిట 2021, మార్చి 21వ తేదీన ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఆ ఫొటో తెగ వైరల్ అయింది. సనాతన ధర్మం అభివృద్ధి చెందుతోందని, పూజారీగా ఉండటానికి మగవారు లేదా.. హిందూ కుటుంబంలో జన్మించాలా ? పూజారీగా ఉండటానికి బ్రాహ్మణుడు కావాల్సిన అవసరం లేదని ట్వీట్ లో పొందుపరిచాడు. దీనికి నెటిజన్ల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు…11.7 K లైక్స్ రాగా, 2 వేల 400 మంది రీ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News