చిరు వ్యాపారులకు నిబంధనలు.. కార్పొరేట్‌లకు కలెక్షన్లు…!

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు కేవలం చిరు వ్యాపారులకేనా..? అనే అనుమానం కలుగక మానదు. ఇందుకు 44వ నెంబర్ జాతీయ రహదారి సర్వీసురోడ్డును చూస్తే అర్థమవుతోంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుచిత్ర చౌరస్తా నుంచి పేట్‌బషీరాబాద్ పీఎస్, కొంప్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారి సర్వీసు రోడ్డులకు ఇరువైపుల ఇటీవల వ్యాపార సముదాయాలు అధికమయ్యాయి. అయితే ఈ రోడ్డు బడా వ్యాపార సముదాయాలకు వచ్చే వాహనాల పార్కింగ్ యార్డులుగా మారాయి. […]

Update: 2021-06-19 06:55 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు కేవలం చిరు వ్యాపారులకేనా..? అనే అనుమానం కలుగక మానదు. ఇందుకు 44వ నెంబర్ జాతీయ రహదారి సర్వీసురోడ్డును చూస్తే అర్థమవుతోంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుచిత్ర చౌరస్తా నుంచి పేట్‌బషీరాబాద్ పీఎస్, కొంప్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారి సర్వీసు రోడ్డులకు ఇరువైపుల ఇటీవల వ్యాపార సముదాయాలు అధికమయ్యాయి. అయితే ఈ రోడ్డు బడా వ్యాపార సముదాయాలకు వచ్చే వాహనాల పార్కింగ్ యార్డులుగా మారాయి. ఇటీవల కాలంలో సర్వీసు రోడ్డు పక్కన పండ్ల దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్టులు ఏర్పాటు చేసుకోగా సర్కిల్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి రోడ్డును ఆక్రమించారనే ఆరోపణలతో ఏమాత్రం కనికరం లేకుండా వాటిని తొలగించారు.

కొన్ని దుకాణాలనైతే పూర్తిగా ధ్వంసం చేశారు. రోడ్డును ఆక్రమించినందుకు తొలగించడం వరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుతం చిరు వ్యాపారాలను తొలగించిన ప్రాంతాల్లో బడా వ్యాపార సముదాయాలకు వచ్చే కార్లను నిలిపేందుకు ఉపయోగిస్తున్నారు. చిన్న ఛాయ్ డబ్బా పెట్టుకుంటేనే తొలగించిన అధికారులు, గంటల తరబడి వాహనాలను నిలుపుతున్నా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల నెలా వచ్చే ఆమ్యామ్యాలకు అలవాటు పడి పార్కింగ్ లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News