ఆర్టీసీ ఉద్యోగులను కరోనా వారియర్స్‌గా గుర్తించాలి
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీలో కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధానకార్యదర్శి రాజిరెడ్డి కోరారు. సోమవారం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, స్టాఫ్అండ్ వర్కర్స్ యూనియన్, బహుజన కార్మిక యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలతో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో కరోనాపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు రూ.50లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, చికిత్స పొందిన వారికి రీయింబర్స్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీలో కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధానకార్యదర్శి రాజిరెడ్డి కోరారు. సోమవారం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, స్టాఫ్అండ్ వర్కర్స్ యూనియన్, బహుజన కార్మిక యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలతో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో కరోనాపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు రూ.50లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, చికిత్స పొందిన వారికి రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని, తార్నాక హాస్పిటల్‌లో కరోనా రోగుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెరుగైన ట్రీట్ మెంట్ అవసరమైతే ఇతర దవాఖానకు రిఫర్ చేయాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 21 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలన్నారు.
డ్రైవర్, కండక్టర్లకు ఎన్-95 మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, పీపీఈ కిట్లు ఇవ్వాలని, బస్టాండ్ లలో శానిటైజ్ చేయాలని, ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ఉద్యోగులకు డిపోల్లోనే టీకా ఇప్పించే ఏర్పాట్లు చేయాలనికోరారు. ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలన్నారు.
ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, స్టాఫ్అండ్ వర్కర్స్ యూనియన్, బహుజన కార్మిక యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు.