సీఎంఆర్ఎఫ్‌కు ఆర్టీసీ ఉద్యోగుల విరాళం

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి సినిమా, పరిశ్రమలు, వ్యాపార వర్గాల నుంచి మాత్రమే కార్మికవర్గం కూడా మానవత్వంతో స్పందిస్తోంది. రాష్ట్ర రోడ్డు రవాణా కార్మికులు ఒక రోజు మూలవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయడానికి ముందుకొచ్చారు. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఈ మేరకు తీర్మానం చేసింది. తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులందరి మూలవేతనంలో ఒక రోజు వాటాను ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయాల్సిందిగా ఆర్టీసీ ఎండీకి […]

Update: 2020-03-27 03:25 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి సినిమా, పరిశ్రమలు, వ్యాపార వర్గాల నుంచి మాత్రమే కార్మికవర్గం కూడా మానవత్వంతో స్పందిస్తోంది. రాష్ట్ర రోడ్డు రవాణా కార్మికులు ఒక రోజు మూలవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయడానికి ముందుకొచ్చారు. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఈ మేరకు తీర్మానం చేసింది. తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులందరి మూలవేతనంలో ఒక రోజు వాటాను ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయాల్సిందిగా ఆర్టీసీ ఎండీకి రాసిన లేఖలో పేర్కొంది. దీనికి తోడు సమ్మె కాలంలో మృతి చెందిన 31 మంది కార్మికుల కుటుంబాలకు కూడా ప్రతీ ఉద్యోగి వేతనంలోంచి రూ. 400, క్లాస్ ఫోర్ కార్మికులు, గ్యారేజీ కార్మికుల నుంచి రూ. 200 చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయాలని ఆ లేఖలో సూచించారు.

Tags : Telangana, RTC, Workers, Salary, CMRF, Corona

Tags:    

Similar News