ఉదయం 6 నుంచి 10గంటల వరకే ఆర్టీసీ బస్సులు..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో తాజాగా మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేయలేదు. అయితే, ప్రయాణికులు వెంటనే కంగారు పడి గుంపులు గుంపులుగా బస్సుల్లో వెళ్లకుండా, ఉదయం వేళల్లో మాత్రమే జర్నీలు చేయాలని ప్రకటించింది. కాగా, 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రాష్ట్రంలో బస్సులు […]

Update: 2021-05-11 07:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో తాజాగా మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేయలేదు. అయితే, ప్రయాణికులు వెంటనే కంగారు పడి గుంపులు గుంపులుగా బస్సుల్లో వెళ్లకుండా, ఉదయం వేళల్లో మాత్రమే జర్నీలు చేయాలని ప్రకటించింది. కాగా, 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రాష్ట్రంలో బస్సులు నడిపిస్తే సుదూర ప్రాంతాల ప్రజలు ఎలా తమ ఇళ్లకు చేరుకోవడం అనే ప్రశ్నార్థంగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాలు నాలుగు గంటల కంటే ఎక్కువ ప్రయాణం చేయాల్సి వచ్చే వారిపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News