సంచలనంగా మారిన RS ప్రవీణ్ కుమార్ ట్వీట్.. రానా ‘లీడర్’ సీన్ రిపీట్..?
దిశ, వెబ్‌డెస్క్ : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అంటే బలహీన వర్గాల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ప్రజలతో మమేకం అవుతున్నారు. తెలంగాణలో ప్రతీ జిల్లాలో పర్యటిస్తున్నారు. బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ఎత్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వాల తీరుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం 1000 కోట్ల రూపాయాలను ఏ విధంగా ఖర్చు చేయాలో సమగ్రంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఎలాంటి సమగ్రమైన పరిశోధన జరగకుండా […]
దిశ, వెబ్‌డెస్క్ : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అంటే బలహీన వర్గాల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ప్రజలతో మమేకం అవుతున్నారు. తెలంగాణలో ప్రతీ జిల్లాలో పర్యటిస్తున్నారు. బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ఎత్తి చూపిస్తున్నారు.
అందులో భాగంగానే ప్రభుత్వాల తీరుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం 1000 కోట్ల రూపాయాలను ఏ విధంగా ఖర్చు చేయాలో సమగ్రంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
‘‘ఎలాంటి సమగ్రమైన పరిశోధన జరగకుండా అమాయక నిరుపేదలపై వేల కోట్ల ప్రజాధనాన్ని Randomగా వెదజల్లే బదులు.. వారి జీవితాలను Human Development Agendaతో సమూలంగా మార్చవచ్చు. రాబోయే బహుజన రాజ్యంలో ఇలాంటివెన్నో చేయవచ్చు. కొంచెం ఆలోచించండి. Let’s give skill of fishing, not fish.’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లీడర్ సినిమాలో కూడా హీరో రానా లక్ష కోట్ల ప్రజాధనం.. వృథా కాకుండా ప్రజల కోసమే ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తాడు.. అలాగే మీరు కూడా ప్రజా ధనం కోసం చేసిన ప్లాన్ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎలాంటి సమగ్రమైన పరిశోధన జరగకుండా అమాయక నిరుపేదలపై వేల కోట్ల ప్రజాధనాన్ని Random గా వెదజల్లే బదులు వారి జీవితాలను Human Development Agenda తో సమూలంగా మార్చవచ్చు. రా బోయే బహుజన రాజ్యంలో ఇలాంటివెన్నో చేయవచ్చు. కొంచెం ఆలోచించండి. Let’s give skill of fishing, not fish. pic.twitter.com/Jbrqg8KTm7
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 6, 2021