రూ.9.5లక్షల విలువైన మద్యం పట్టివేత
దిశ, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా ఓ ఇంట్లో మద్యం బాటిళ్లను నిల్వ చేసేందుకు తరలిస్తున్న వాహనాన్ని బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మీదేవిపల్లి పీఎస్‌లో ఎస్‌హెచ్‌వో రాజు గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.దుబ్బతండాకు చెందిన భూక్య వెంకన్న అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచేందుకు 97 పెట్టెలలో క్వార్టర్ బాటిళ్లను బొలెరో వాహనంలో తీసుకురాగా, అదే సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.స్వాధీనం చేసుకున్న […]
దిశ, ఖమ్మం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా ఓ ఇంట్లో మద్యం బాటిళ్లను నిల్వ చేసేందుకు తరలిస్తున్న వాహనాన్ని బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మీదేవిపల్లి పీఎస్‌లో ఎస్‌హెచ్‌వో రాజు గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.దుబ్బతండాకు చెందిన భూక్య వెంకన్న అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచేందుకు 97 పెట్టెలలో క్వార్టర్ బాటిళ్లను బొలెరో వాహనంలో తీసుకురాగా, అదే సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను పాల్వంచ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ నుంచి తీసుకువచ్చినట్టు వెంకన్న అంగీకరించినట్టు సమాచారం. పట్టుబడిన మద్యం విలువ రూ.9లక్షల50వేలు ఉంటుందని పోలీసుల అంచనా. క్వార్టర్ బాటిళ్లను తరలించడానికి ఉపయోగించిన TS 28T4345 నెంబర్ గల బొలెరోను సీజ్ చేసినట్టు వివరించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని కొత్తగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐకి లక్ష్మీదేవిపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు.
Tags: wine stock, handover by police, rs.9.5lac value, khammam dist