ఈపీఎఫ్ నుంచి రూ. 3601 కోట్లు తీసుకున్నారు!

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 సంక్షోభం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-ఏఫ్F అకౌంట్ల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి క్లెయిమ్స్ చేసుకున్నారు. గడిచిన 15 రోజుల్లో మొత్తం రూ.3,600.85 కోట్ల ఉపసంహరణ జరిగిందని వివరణ ఇచ్చింది. ఈ క్లెయిమ్స్‌ అన్నిటినీ మూడు రోజుల్లోనే సెటిల్ చేశామని కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 26న […]

Update: 2020-04-23 00:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 సంక్షోభం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-ఏఫ్F అకౌంట్ల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి క్లెయిమ్స్ చేసుకున్నారు. గడిచిన 15 రోజుల్లో మొత్తం రూ.3,600.85 కోట్ల ఉపసంహరణ జరిగిందని వివరణ ఇచ్చింది. ఈ క్లెయిమ్స్‌ అన్నిటినీ మూడు రోజుల్లోనే సెటిల్ చేశామని కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మార్చి 26న కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సంఘటిత రంగంలోని ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా మూడు నెలల వేతనం+డీఏ ఇందులో ఏది తక్కువ అయితే అది విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును ఇంచ్చింది. కరోనా వైరస్ కారణంగా చూపించి అడ్వాన్స్ తీసుకోవచ్చు. అంతేకాకుండా వందలోపు ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థల్లో రూ.15,000 కంటే తక్కువ వేతనం ఉన్నవారికి ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతం మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Tags : Coronavirus, Coronavirus Pandemic, Lockdown, EPFO

Tags:    

Similar News