ఫైనల్ టచెస్లో RRR మూవీ
దిశ, వెబ్‌డెస్క్ : RRR సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్లో బిజీగా ఉంది. చాల కాలం నుంచి సెట్స్‌లో ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ ఎపిసోడ్ నే షూట్ చేస్తున్నారు జక్కన్న. మూడేళ్ల నుంచి టాలీవుడ్ హాట్ టాపిక్‌గా ఉన్న ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. నిక్.. గ్లాడియేటర్, బ్రేవ్ హార్ట్, ద లాస్ట్ సమురాయ్.. లాంటి భారీ సినిమాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేశారు . […]
దిశ, వెబ్‌డెస్క్ : RRR సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్లో బిజీగా ఉంది. చాల కాలం నుంచి సెట్స్‌లో ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ ఎపిసోడ్ నే షూట్ చేస్తున్నారు జక్కన్న. మూడేళ్ల నుంచి టాలీవుడ్ హాట్ టాపిక్‌గా ఉన్న ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. నిక్.. గ్లాడియేటర్, బ్రేవ్ హార్ట్, ద లాస్ట్ సమురాయ్.. లాంటి భారీ సినిమాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేశారు .
కత్తి యుద్దాలకు, హైలీ యాక్షన్ సీన్స్‌కి ఫేమస్ అయిన నిక్.. ట్రిపుల్ ఆర్‌లో యాక్షన్ ని నెవర్ బిఫోర్ అంటూ గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. అంతకు ముందు మణికర్ణికకు కత్తియుద్ధాల్ని, స్టంట్స్‌ని డిజైన్ చేశారు నిక్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్స్ చేత ట్రెయినింగ్ ఇప్పించి మరీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని కంప్లీట్ చేస్తున్నారు రాజమౌళి అండ్ కో.
ట్రిపుల్ ఆర్ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ అనౌన్స్ చేశారు రాజమౌళి. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా ఫైనల్ టచెస్ చేసుకుంటోంది. నిక్ తో షూట్ చేస్తున్న ఈ మేజర్ యాక్షన్ పార్ట్ అయిపోతే సినిమా ఆల్ మోస్ట్ కంప్లీటే అంటున్నారు యూనిట్. సమ్మర్ కి షూటింగ్ ఫినిష్ చేస్తే .. సి.జి వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకా 4 నెలలు టైమ్ ఉంటుంది. దీంతో అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేసి ఆడియన్స్‌ని యాక్షన్‌తో ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు జక్కన్న.