సచిన్ జెర్సీ, బ్యాట్, బాల్ చోరీ
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చెందిన జెర్సీ, బ్యాట్, బాల్ చోరీకి గురయ్యాయి. టీమ్‌ఇండియా తరఫున ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్‌కు కొన్ని స్టేడియాలు కలిసి వచ్చాయి. తాను రికార్డులు సృష్టించిన స్టేడియాల పట్ల సచిన్‌కు ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపిస్తుండేవాడు. అలాగే, కేరళలోని కొచ్చి జవహర్‌లాల్ స్టేడియం అంటే కూడా చాలా ఇష్టం. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌పై ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఈ స్టేడియంలోని పెవీలియన్‌కు సచిన్ పేరు కూడా […]
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చెందిన జెర్సీ, బ్యాట్, బాల్ చోరీకి గురయ్యాయి. టీమ్‌ఇండియా తరఫున ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్‌కు కొన్ని స్టేడియాలు కలిసి వచ్చాయి. తాను రికార్డులు సృష్టించిన స్టేడియాల పట్ల సచిన్‌కు ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపిస్తుండేవాడు. అలాగే, కేరళలోని కొచ్చి జవహర్‌లాల్ స్టేడియం అంటే కూడా చాలా ఇష్టం. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌పై ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఈ స్టేడియంలోని పెవీలియన్‌కు సచిన్ పేరు కూడా పెట్టారు. అంతేకాకుండా అక్కడ సచిన్ స్వయంగా సంతకం చేసిన 10వ నెంబర్ జెర్సీ, బ్యాట్, బాల్ పెవీలియన్‌లో ఉంచారు. గత కొన్ని రోజులుగా ఈ వస్తువులు అక్కడ కనిపించడం లేదంటా. సచిన్ అందించిన ఆ వస్తువుల జాడ కనపడకపోవడంపై స్టేడియం అధికారులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరకు దర్యాప్తు చేయగా ఎవరో దొంగలించినట్లు తేలింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఎంతో ప్రేమతో అందించిన వస్తువులను పోగొట్టడంపై సచిన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.