చరిత్ర సృష్టించిన రొనాల్డో

దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. సమకాలీన ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎవరూ అందుకోని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇటాలియన్ సూపర్‌కప్‌లో జూవెంటస్ తరపున ఆడిన రొనాల్డో.. నాపోలీపై గోల్ చేసి ఆల్‌టైం రికార్డును చేరుకున్నాడు. ఇప్పటి వరకు అత్యధిక గోల్స్ చేసిన చెక్ రిపబ్లిక్ ఆటగాడు జోసెఫ్ బిసాన్ సరసన నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో సమకాలీన పుట్‌బాలర్లలో అగ్రస్థానంలో ఉన్నట్లు యూరోప్ పత్రికలన్నీ అతడిని పొగడ్తలతో ముంచెత్తాయి. రొనాల్డో, జోసెఫ్ […]

Update: 2021-01-21 10:16 GMT

దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. సమకాలీన ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎవరూ అందుకోని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇటాలియన్ సూపర్‌కప్‌లో జూవెంటస్ తరపున ఆడిన రొనాల్డో.. నాపోలీపై గోల్ చేసి ఆల్‌టైం రికార్డును చేరుకున్నాడు. ఇప్పటి వరకు అత్యధిక గోల్స్ చేసిన చెక్ రిపబ్లిక్ ఆటగాడు జోసెఫ్ బిసాన్ సరసన నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో సమకాలీన పుట్‌బాలర్లలో అగ్రస్థానంలో ఉన్నట్లు యూరోప్ పత్రికలన్నీ అతడిని పొగడ్తలతో ముంచెత్తాయి. రొనాల్డో, జోసెఫ్ బిసాన్ ప్రస్తుతం 760 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో పీలే (757), రొమారియో (743), లియోనల్ మెస్సీ (719) తర్వాత స్థానాల్లో ఉన్నారు. కాగా, ఇప్పుడు ఫుట్‌బాల్ ఆడుతున్న వారిలో రొనాల్డో మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాడు. రొనాల్డో 760 గోల్స్ చేయగా ఆ తర్వాత స్థానంలో మెస్సీ 719 గోల్స్‌తో ఉన్నాడు.

రికార్డులు లేకనే..

క్రిస్టియానో రొనాల్డో మొత్తం 760 గోల్స్ చేయగా.. వీటిలో 102 గోల్స్ తన దేశమైన పోర్చుగల్ జాతీయ జట్టుకు చేశాడు. మిగిలిన గోల్స్ అన్నీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్స్‌లో చేసినవే. ఈ సీజన్‌లోనే రొనాల్డో ప్రొఫెషనల్ లీగ్స్‌లో పీలే రికార్డును బద్దలు కొట్టి ముందుకు దూసుకొని వెళ్లాడు. తాజాగా అగ్రస్థానంలో ఉన్న జోసెఫ్ బిసాన్ సరసన నిలిచి సంచలనం సృష్టించాడు. కాగా, దిగ్గజ సాకర్ ప్లేయర్లు జోసెఫ్ బిసాన్, పీలే, రొమారియో తమ కెరీర్‌లో 1000 కంటే ఎక్కువ గోల్సే చేశారు. అయితే వాటిలో అనధికార మ్యాచ్‌లు, ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో చేసినవి కూడా ఉన్నాయి. మరోవైపు ఫుట్‌బాల్ స్టాటిస్టిక్స్ నిర్వహించే ‘ఆప్టా’ అనే బ్రిటిష్ సంస్థ వద్ద వాళ్లు చేసిన గోల్స్ అన్నింటి రికార్డులు లేవు. దీంతో ఫిఫా.. ఇతర పద్దతుల ద్వారా డేటా సేకరించి అత్యధిక గోల్స్ జోసెఫ్ బిసాన్ (760) పేరుతో నమోదు చేసింది. ఆ లెక్కల ప్రకారమే క్రిస్టియన్ రొనాల్డో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్ సరసన నిలిచాడు.

ఎప్పుడు ఎలా..?

పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో క్లబ్ ఆటగాళ్లలో అత్యంత విలువైన ఆటగాడు. తన దేశం కోసం 102 గోల్స్ చేసిన రొనాల్డో.. ఒక క్లబ్స్ మ్యాచ్‌లలో 658 గోల్స్ కొట్టాడు. వీటిలో స్పోర్టింగ్ లిస్బన్ తరపున 5 గోల్స్, మాంచెస్టర్ యునైటెడ్ 118, రియల్ మాడ్రిడ్ 450 గోల్స్ కొట్టాడు. ఇక గత మూడు సీజన్లుగా జువెంటస్ క్లబ్ తరపున ఆడుతున్న రొనాల్డో 85 గోల్స్ చేశాడు. క్లబ్ కెరీర్ ప్రారంభించి దాదాపు 14 ఏళ్లు గడిచాయి. అయితే 2013 సీజన్‌లో అత్యధికంగా 69 గోల్స్ కొట్టాడు. ఇక 2007లో 34, 2008లో 35, 2009లో 30, 2010లో 48, 2011లో 60, 2012లో 63, 2014లో 61, 2015లో 57, 2016లో 55, 2017లో 53 గోల్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐదు సార్లు ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచిన రొనాల్డో ఆ టోర్నీలో 134 గోల్స్ చేశాడు. ఇక లా లిగాలో 311, ప్రీమియర్ లీగ్‌లో 84, ఏ సిరీస్‌లో 67, వరల్డ్ కప్ క్వాలిఫయింగ్‌లో 30, యూరోపియన్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్‌లో 31, ఎఫ్ఏ కప్‌లో 13, వరల్డ్‌కప్‌లో 7 గోల్స్ చేశాడు.

Tags:    

Similar News