రోల్డ్ గోల్డ్ గాజులు ఎంత పని చేయించాయి
దిశ, జల్‌పల్లి : రోల్డ్‌గోల్డ్ గాజులు, సైబర్ మాయ రెండు కలిసి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. రెండు రోజుల క్రితం వెలుగులో వచ్చిన మహిళా పూజారి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. బీహార్‌కు చెందిన బాదల్ కుమార్ఎలియాస్బాదల్ఎలియాస్ విరాట్ (20) ఐదు నెలల క్రితం మామిడిపల్లి గ్రామంలో గోషాల నిర్వాహకుడు కిరణ్ […]
దిశ, జల్‌పల్లి : రోల్డ్‌గోల్డ్ గాజులు, సైబర్ మాయ రెండు కలిసి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. రెండు రోజుల క్రితం వెలుగులో వచ్చిన మహిళా పూజారి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. బీహార్‌కు చెందిన బాదల్ కుమార్ఎలియాస్బాదల్ఎలియాస్ విరాట్ (20) ఐదు నెలల క్రితం మామిడిపల్లి గ్రామంలో గోషాల నిర్వాహకుడు కిరణ్ దగ్గర పనికి కుదిరాడు. నెలకు 10వేల రూపాయల చొప్పున జీతానికి బాధల్ కుమార్ పనిచేస్తున్నాడు.
ఎయిర్‌పోర్ట్‌లో జాబ్‌కోసం
బాదల్కుమార్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి శంషాబాద్ఎయిర్పోర్ట్లో ఎలాగైనా జాబ్ చేయాలని ఇండిగో కంపెనీలో జాబ్‌కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. రెండు నెలల క్రితం ఓ మహిళ కాల్ చేసి ఇండిగోలో జాబ్ కోసం 1600 కట్టాలని చెప్పడంతో యజమాని కిరణ్ ఫోన్ నెంబర్ నుంచి గూగుల్‌పే చేయించాడు. మరో సారి 8600 కట్టాలని సదరు మహిళ ఫోన్ చేయడంతో మళ్లీ యజమాని కిరణ్‌తో గూగుల్ పే చేయించాడు.
ఐదు రోజుల అనంతరం నీ ఉద్యోగం ఖాయమని దానికి సంబంధించిన 14000 చెల్లించాలనడంతో మూడవ సారి గూగుల్ పే చేయించాడు. నాలుగవ సారి 25వేల చెల్లించాలని ఈ మొత్తం రీఫండబుల్ అని నమ్మించడంతో నాదగ్గర ఇపుడు డబ్బులు లేవని..నాకు ఉద్యోగం రాకుండా చేయకండి. వచ్చే నెల చెల్లిస్తానని వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. మరోసారి యజమాని కిరణ్‌ను 25 వేల రూపాయలను అడగడంతో ఇప్పటికే మూడు సార్లు ఇచ్చానని, నా దగ్గర డబ్బులు లేవని , ఇవన్ని నమ్మొద్దు సైబర్ నేరాలు అని ఎంత జెప్పినా బాదల్కుమార్నమ్మలేదు.
మహిళా పూజారి చేతి గాజుల పై పడ్డ దృష్టి.. హత్యకు కుట్ర
దీంతో గోషాల నుంచి 50 మీటర్ల దూరంలో రంగనాయకుల దేవాలయంలో ఒంటరిగా ఉండే మహిళా పూజారి కౌశిక్ శోభాశర్మ(76) వద్దకు అపుడపుడు వెళ్లి మంచి నీళ్లు తాగి వచ్చే నేపధ్యంలో బాదల్ దృష్టి ఆమె చేతికి ఉన్న గాజులు పై దృష్టి పడింది. ఆ బంగారు గాజులతో పాటు ఇంట్లో చాలా డబ్బులు ఉండవచ్చని పథకం వేశాడు. ఎలాగైనా ఆమెను అంతం చేసి దోచున్న బంగారం, డబ్బులతో ఎయిర్పోర్ట్ లో 25 వేలు కడితే తన కళ నెర వేరుతుందని కుట్రపన్నాడు. ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా 28 వ తేదీన దూడను కట్టేసే తాడును తీసుకుని మహిళా పూజారి గది దగ్గరికి పోయాడు.
అగ్గిపెట్టె అడగగానే ఆమె ప్రహరీ లోపల ఉండే అగ్గిపెట్టె ఇవ్వడంతో ఆమెను చంపే ధైర్యం చాలక వెంటనే తిరిగి గోషాలకు వెళ్లాడు. 20 నిమిషాల తర్వాత మరోసారి ప్రహరీగోడ దూకి వెళ్లి మంచినీళ్లు అడిగాడు. ఆమె ఇచ్చిన మంచినీరు త్రాగగానే ఆమె ఇంట్లోకి వెళ్లడానికి తిరగడంతో ఇదే అదనుగా భావించి వెంట తెచ్చుకున్న తాడుతో మెడకు వేసి బిగుతుగా గుంజడంతో ఆ వృద్దురాలు అక్కడికక్కడే క్రింద పడిపోయింది. వెంటనే ఆమె రెండు చేతులకు ఉన్న గాజులను తీసుకుని బాధల్ అక్కడి నుంచి గోషాలలోని తన గదికి వెళ్లాడు. వెంటనే అక్కడికి వెళ్లి స్టౌవ్ వెలిగించి ఆ గాజులను చెక్ చేసుకున్నాడు. అవి బంగారు గాజులు కావని నకిలీవని తేల్చుకున్నాడు.
మరో 15 నిమిషాల తర్వాత మళ్లీ మహిళా పూజారి గది వద్దకు వెళ్లాడు. అప్పటికీ ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో మరోసారి తాడుతో మెడకు గట్టిగా ఉరి బిగించాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్నాక ఎవ్వరికీ అనుమానం రాకుండా గోషాలకు వెళ్లి ఎప్పటిలాగానే పనులు చేసుకోసాగాడు. బంగారు గాజులు నకిలీవి అని తేల్చుకున్న వెంటనే వాటిని గోషాలకు దూరంగా విసిరేశాడు. గోషాల నిర్వాహకుడు కిరణ్ అపుడే వచ్చి రాత్రి 6గంటలకు తిరిగి వెళ్లడంతో బాదల్ కుమార్ గోషాలలోని గడ్డపారను తీసుకుని పూజారి ఇంటికి వెళ్లాడు.
గడ్డపారతో బీరువా తాళాలు పగుల కొట్టి బీరువాలో ఉన్న రెండు గాజులు, తెల్లపూసల గొలుసు, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్‌కార్డు, 1500 నగదును దోచుకుని బాధల్కుమార్ గోషాలకు వెళ్లాడు. ఆమెను హత్య చేసి దోచుకున్న డబ్బుతో మద్యం కొనుగోలు చేసి సేవించి తిరిగి ఎప్పటిలాగానే గోషాలకు వచ్చి పనులు చేసుకోసాగాడు. రాత్రి 9గంటల సమయంలో ఆలయ మహిళా పూజారి హత్యకు గురయిందని సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగానే తనకు ఏమీ తెలియనట్టు నటించి అక్కడే కాసేపు ఉన్నాడు. రంగనాయకుల దేవాలయం పరిసర ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు గోషాలలో పని చేసే బాదల్ కుమార్‌ను అనుమానంతో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు.