భర్త సెల్వమణికి చుక్కలు చూపించిన ఎమ్మెల్యే రోజా

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది నగరి ఎమ్మెల్యే రోజా. ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంలో ఆమెకు ఆమె సాటి. నటనలోనూ.. రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా తాజాగా తనలోని మరోకోణాన్ని బయటపెట్టారు. కబడ్డీ ఆట ఆడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీలను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. అయితే […]

Update: 2021-11-01 01:50 GMT
భర్త సెల్వమణికి చుక్కలు చూపించిన ఎమ్మెల్యే రోజా
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది నగరి ఎమ్మెల్యే రోజా. ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంలో ఆమెకు ఆమె సాటి. నటనలోనూ.. రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా తాజాగా తనలోని మరోకోణాన్ని బయటపెట్టారు. కబడ్డీ ఆట ఆడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీలను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.

అయితే గతంలోనూ రోజా కబడ్డీ ఆడటంతో అక్కడ ఉన్న ప్లేయర్స్ తమతో ఆడాలని రోజాను కోరడంతో ఆమె బరిలోకి దిగారు. కబడ్డీ కూతతో గ్రౌండ్‌లో హల్ చల్ చేశారు. నిత్యం బిజీబిజీగా ఉండే రోజా ఇలా సరదాగా కబడ్డీ ఆడటంతో అక్కడ వారంతా తెగ మురిసిపోయారు. విజిల్స్ మోత మోగించారు. ఇకపోతే ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థి టీమ్‌లో ఆమె భర్త సెల్వమణి కూడా ఉండటం విశేషం. రోజా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వెళ్లి..పట్టుకోవాలంటూ భర్తకు చేయెత్తి చూపించారు. ఆయన నవ్వుతూ పట్టుకునే ప్రయత్నం చేశారు. అనంతరం సెల్వమణి కూడా రోజా కబడ్డీ కోర్టులోకి వెళ్లగా రోజాను పట్టుకునేందుకు ప్రయత్నించారు. మొత్తానికి రోజా దంపతులు కబడ్డీ ఆడటంతో అక్కడ ఉన్నవారంతా తెగ ఎంజాయ్ చేశారు.

Tags:    

Similar News