రోహిత్ వచ్చేస్తున్నాడు.. విరాట్ కోహ్లీ స్థానం ఎక్కడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన టీమిండియా హార్డ్ హిట్టర్ రోహిత్ శర్మ కోలుకున్నట్టు సమాచారం. దీంతో తొలిసారిగా టీమిండియా వన్డే కెప్టెన్‌గా తాను సౌతాఫ్రికా టూర్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. అంతేకాదు యథావిధిగా గబ్బర్ శిఖర్ దావన్‌తో టీమిండియా తరఫున ఓపెనర్ బ్యాట్స్‌మాన్‌గా బరిలోకి దిగుతాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మొదలైన టెస్టు మ్యాచులు జనవరి 11న ముగియనున్నాయి. ఆ తర్వాత జనవరి 19, 21, 23 తేదీల్లో వన్డే మ్యాచులు […]
దిశ, వెబ్‌డెస్క్: గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన టీమిండియా హార్డ్ హిట్టర్ రోహిత్ శర్మ కోలుకున్నట్టు సమాచారం. దీంతో తొలిసారిగా టీమిండియా వన్డే కెప్టెన్‌గా తాను సౌతాఫ్రికా టూర్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. అంతేకాదు యథావిధిగా గబ్బర్ శిఖర్ దావన్‌తో టీమిండియా తరఫున ఓపెనర్ బ్యాట్స్‌మాన్‌గా బరిలోకి దిగుతాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మొదలైన టెస్టు మ్యాచులు జనవరి 11న ముగియనున్నాయి. ఆ తర్వాత జనవరి 19, 21, 23 తేదీల్లో వన్డే మ్యాచులు జరగనున్నాయి.
అయితే, ఇందుకోసం 15 మందితో కూడిన జట్టు కోసం బీసీసీఐ అంతా సిద్ధం చేసింది. ఇదే జట్టులో విరాట్ కోహ్లీ మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్‌గా ఉంటాడని సమాచారం. పూర్తి జట్టు వివరాలను బోర్డు వచ్చే వారం వెల్లడించనుంది. గతంలో కెప్టెన్సీ వివాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కెప్టెన్‌గా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టబోతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్‌గా రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్ ఎలా సాగబోతుందో అనేది అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది.