రేపే షర్మిల పార్టీ ఆవిర్భావం.. రోడ్ మ్యాప్ ఇదే..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలంటూ వైఎస్ ష‌ర్మిల పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారు. ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ పేరుతో తెలంగాణలో షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రక‌టించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ తాజాగా ఖరారైంది. గురువారం(జూలై 8వ తేదీన) వైఎస్‌ షర్మిల రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక చాపర్‌లో […]

Update: 2021-07-07 02:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలంటూ వైఎస్ ష‌ర్మిల పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారు. ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ పేరుతో తెలంగాణలో షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రక‌టించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ తాజాగా ఖరారైంది. గురువారం(జూలై 8వ తేదీన) వైఎస్‌ షర్మిల రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకోనున్నారు.

ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక చాపర్‌లో మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌‌కు రానున్నారు. విమానాశ్రయం వద్ద తెలంగాణ సంప్రదాయం ప్రకారం బోనాలు, వేడుకలతో షర్మిలకు ఆహ్వానం పలుకనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైఎస్‌ షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్‌కు చేరుకుని 5 గంటలకు వైఎస్‌ షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6.30 గంటలకు కొనసాగనుంది. అయితే, ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ అభిమానులు నేరుగా జూమ్ యాప్ ద్వారా వీక్షించేంలా ఏర్పాట్లు చేసినట్లు షర్మిల పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News