చూస్తుండగానే విరిగిపడిన కొండ చరియలు.. భయంతో వణికిపోయిన పర్యాటకులు

దిశ, వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని నహాన్ ప్రాంతం బద్వాస్ సమీపంలో ఉన్న పర్వతానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కొండ చరియలు విరిగిపడిపోయాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. కొండ చరియలు విరిగిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొండ చరియలు […]

Update: 2021-07-30 03:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని నహాన్ ప్రాంతం బద్వాస్ సమీపంలో ఉన్న పర్వతానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కొండ చరియలు విరిగిపడిపోయాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు.

కొండ చరియలు విరిగిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొండ చరియలు విరిగిపడుతున్న ఈ వీడియోను కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News