మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. అండగా ఉంటానన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ, నాగర్ కర్నూల్ / మహబూబ్ నగర్ : రెండు బైకులు వేగంగా ఢీకొట్టుకోవడంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల శివారులో ఆదివారం వెలుగుచూసింది. నాగనూల్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైకుపై ఈ రోజు పెద్ద కొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ దేవుని దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తుండగా పెద్దకార్పముల గ్రామానికి చెందిన లచ్చల బక్కయ్య, భార్య, కుమారుడు ముగ్గురు నాగర్ కర్నూల్ నుంచి స్వగ్రామానికి తిరిగి వెళుతున్నారు. […]

Update: 2021-09-19 09:26 GMT

దిశ, నాగర్ కర్నూల్ / మహబూబ్ నగర్ : రెండు బైకులు వేగంగా ఢీకొట్టుకోవడంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల శివారులో ఆదివారం వెలుగుచూసింది. నాగనూల్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైకుపై ఈ రోజు పెద్ద కొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ దేవుని దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తుండగా పెద్దకార్పముల గ్రామానికి చెందిన లచ్చల బక్కయ్య, భార్య, కుమారుడు ముగ్గురు నాగర్ కర్నూల్ నుంచి స్వగ్రామానికి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో రెండు బైకులు అతివేగంతో ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలవ్వగా అటుగా వెళుతున్న గ్రంథాలయ చైర్మన్ హన్మంతరావు వారిని 108 సిబ్బందికి సమాచారం ఇచ్చి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు.

మన్యంకొండ వద్ద రోడ్డు ప్రమాదం..

మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుంచి కల్వర్టు కాలువలో పడి మనోజ్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు తిరుమలాయపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి అని రూరల్ ఎసై తెలిపారు. మహబూబ్ నగర్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి బి. శ్రీనివాస్ గౌడ్ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News