పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్తాన్‌లోని ప్రావిన్స్‌లో గత మూడు రోజుల క్రితం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 62 మంది మరణించిన ఘటన మరవక ముందే పాకిస్తాన్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. బలూచ్ ప్రావిన్స్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సింధ్ ప్రావిన్స్ లోని లార్కానా జిల్లా నుంచి ఖుజ్దార్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. […]
దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్తాన్‌లోని ప్రావిన్స్‌లో గత మూడు రోజుల క్రితం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 62 మంది మరణించిన ఘటన మరవక ముందే పాకిస్తాన్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. బలూచ్ ప్రావిన్స్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సింధ్ ప్రావిన్స్ లోని లార్కానా జిల్లా నుంచి ఖుజ్దార్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ప్రావిన్స్‌లోని పారా మిలటరీ దళాలు ఖుజ్దూర్ లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అతివేగంగా వచ్చిన బస్సు డీప్ కర్వ్ వద్ద అతివేగంతో మలుపు తిప్పడంతో బస్సు బోల్తా పడినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే 15 మంది అక్కడికక్కడే మరణించగా ఆసుపత్రులకు తరలించే క్రమంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.