పని కోసం వచ్చి.. ప్రమాదానికి గురయ్యారు

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని అద్దంకికి చెందిన 20 మంది కూలీలు హైదరాబాద్, జోగిపేట ప్రాంతంలో పనిచేసేందుకు వలస వెళ్లారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఏ పనులు దొరకడం లేదు. దీంతో తిరిగి సొంత ప్రాంతం అద్దంకికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. హైదరాబాద్ నుంచి […]

Update: 2020-05-30 21:55 GMT

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని అద్దంకికి చెందిన 20 మంది కూలీలు హైదరాబాద్, జోగిపేట ప్రాంతంలో పనిచేసేందుకు వలస వెళ్లారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఏ పనులు దొరకడం లేదు. దీంతో తిరిగి సొంత ప్రాంతం అద్దంకికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. హైదరాబాద్ నుంచి అద్దంకికి వెళ్లేందుకు ఆటోలో 20 మంది హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న ఆటో నార్కట్‌పల్లికి రాగానే.. అద్దంకి – నార్కట్‌పల్లి రహదారి వైపునకు మళ్లాలి. కానీ, ఆటో డ్రైవర్‌కు రూటు సరిగా తెలియకపోవడంతో ఆటోను విజయవాడ వైపు నడిపాడు. ఈ క్రమంలో నకిరేకల్ సమీపంలోని ఇనుపాముల బైపాస్ వద్ద ఆ ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 20 మంది కూలీల్లో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. గాయపడిన వారిని మూడు అంబులెన్సుల ద్వారా నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News