నయన్ బ్లెస్సింగ్స్ వల్లే గెలిచారు? మీమ్స్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్ : లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘మూకుతి అమ్మన్’.. తెలుగులో అమ్మోరు తల్లిగా వచ్చేస్తోంది. దివాళీ కానుకగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల అవుతున్న ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆర్జే బాలాజీ ఏ ఒక్క విషయాన్ని కూడా వదులుకోవాలని అనుకోవడం లేదు. ఈ క్రమంలోనే అమెరికా ఎలక్షన్స్‌కు, అమ్మోరు తల్లికి రిలేషన్ మ్యాచ్ చేస్తూ ఓ మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. […]

Update: 2020-11-09 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘మూకుతి అమ్మన్’.. తెలుగులో అమ్మోరు తల్లిగా వచ్చేస్తోంది. దివాళీ కానుకగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల అవుతున్న ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆర్జే బాలాజీ ఏ ఒక్క విషయాన్ని కూడా వదులుకోవాలని అనుకోవడం లేదు. ఈ క్రమంలోనే అమెరికా ఎలక్షన్స్‌కు, అమ్మోరు తల్లికి రిలేషన్ మ్యాచ్ చేస్తూ ఓ మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమ్మోరు తల్లి దీవెనతోనే ఎన్నికల్లో గెలిచారంటూ.. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హారిస్‌ను అమ్మవారు ఆశీర్వదిస్తున్న ఫొటో షేర్ చేశాడు.

https://twitter.com/RJ_Balaji/status/1325321988294860800?s=20

దీనిపై భారీగా స్పందించిన నెటిజన్లు.. ఆర్జే బాలాజీ అన్న, వచ్చే ఏడాది అమ్మవారిని కొంచెం ముందుగా రమ్మని చెప్పండి. తను ఆశీర్వదిస్తే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే తప్పకుండా గెలుస్తుందని అంటున్నారు. ఇంకొందరేమో కరోనాకు మందు కనిపెట్టినా సరే.. అమ్మోరు తల్లి కృపతోనే అంటారేమో అని నవ్వుతున్నారు. కాగా ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇషారీ కె. గణేష్ నిర్మించగా.. గిరిష్ జీ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకోగా నవంబర్ 14న సినిమా విడుదల కానుంది.

Tags:    

Similar News