రియా సోదరుడికి 18 గంటల విచారణ..

దిశ, వెబ్ డెస్క్ :హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్ ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) అధికారులు సుమారు 18 గంటల పాటు విచారించారు. ముంబైలోని ఈడీ కార్యాలయానికి శనివారం మధ్యాహ్న ప్రాంతంలో వెళ్లిన షోవిక్.. ఆదివారం ఉదయం 7 గంటలకు బయటకు వచ్చాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు అతడు తప్పించుకునే సమాధానాలిచ్చినట్లు తెలుస్తోంది. అతడిని ఈడీ అధికారులు విచారించడం ఇది రెండో సారి. మళ్ళీ సోమవారం కూడా […]

Update: 2020-08-09 10:28 GMT

దిశ, వెబ్ డెస్క్ :హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్ ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) అధికారులు సుమారు 18 గంటల పాటు విచారించారు. ముంబైలోని ఈడీ కార్యాలయానికి శనివారం మధ్యాహ్న ప్రాంతంలో వెళ్లిన షోవిక్.. ఆదివారం ఉదయం 7 గంటలకు బయటకు వచ్చాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు అతడు తప్పించుకునే సమాధానాలిచ్చినట్లు తెలుస్తోంది.

అతడిని ఈడీ అధికారులు విచారించడం ఇది రెండో సారి. మళ్ళీ సోమవారం కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మనీ లాండరింగ్ చట్టం కింద అధికారులు ప్రశ్నించారని, అతని వ్యక్తిగత వ్యాపారం, ఆదాయం, పెట్టుబడులు, సుశాంత్‌తో గల ఆర్ధిక లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు.

మరో వైపు రియా చక్రవర్తిని సైతం మరల సోమవారం ఇంటరాగేషన్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆమెను సుమారు 8 గంటల పాటు విచారించారు. ఈ నెల 7 న రియాను, ఆమె తండ్రి ఇంద్రజిత్‌ను, ఆమె చార్టర్డ్ అకౌంటెంట్‌ను, మాజీ బిజినెస్ మేనేజర్ శృతి మోడీని కూడా ఈడీ ప్రశ్నించింది. అయితే, సుశాంత్ మృతి కేసును సీబీఐ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News