మరోసారి చాంపియన్‌గా నిలిచిన రీతు ఫొగట్

దిశ, స్పోర్ట్స్: ఎంఎంఏ (మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైటర్‌గా మారిన భారతీయ స్టార్ రెజ్లర్ రీతు ఫొగట్ వరుసగా నాలుగోసారి ఎంఎంఏ చాంపియన్‌షిప్ టైటిల్ గెల్చుకున్నది. సింగపూర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఫిలిప్పైన్స్‌కు చెందిన జొమారి టోరెస్‌తో జరిగిన మ్యాచ్‌లో నాకౌట్ విజయం సాధించింది. ఇండియన్ ‘ఆడ పులి’గా మార్షల్ ఆర్ట్స్ సర్కిల్స్‌లో పిలవబడే రితు.. తొలి రౌండ్‌లోనే నాకౌట్ పంచ్‌తో టోరెస్‌ను మట్టి కరిపించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే టోరెస్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన […]

Update: 2020-12-05 09:53 GMT

దిశ, స్పోర్ట్స్: ఎంఎంఏ (మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైటర్‌గా మారిన భారతీయ స్టార్ రెజ్లర్ రీతు ఫొగట్ వరుసగా నాలుగోసారి ఎంఎంఏ చాంపియన్‌షిప్ టైటిల్ గెల్చుకున్నది. సింగపూర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఫిలిప్పైన్స్‌కు చెందిన జొమారి టోరెస్‌తో జరిగిన మ్యాచ్‌లో నాకౌట్ విజయం సాధించింది. ఇండియన్ ‘ఆడ పులి’గా మార్షల్ ఆర్ట్స్ సర్కిల్స్‌లో పిలవబడే రితు.. తొలి రౌండ్‌లోనే నాకౌట్ పంచ్‌తో టోరెస్‌ను మట్టి కరిపించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే టోరెస్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన ఫొగట్.. విసిరిన ఒక షూట్ పంచ్‌త్ నాకౌట్ అయ్యింది. ప్రత్యర్థికి పంచ్‌లు విసిరే అవకాశం లేకుండా డిఫెండ్ చేసుకోవడమే కాకుండా సరైన సమయంలో పంచ్‌లు విసిరి తొలి రౌండ్‌లోనే విజయం సాధించింది. దీంతో రీతు ఫొగట్ 4-0 తేడాతో రికార్డును కొనసాగిస్తున్నది.

Tags:    

Similar News