రిషబ్ పంత్ కీపింగ్.. పేలుతున్న జోకులు

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అతడు బ్యాటింగ్ చేస్తుంటే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు టీవీల ముందు కూర్చున్న క్రికెట్ అభిమానులు సైతం ఆనందంతో గంతులేస్తున్నారు. అయితే టీవీల ముందు కూర్చొని చూస్తున్న ప్రేక్షకులకు రిషబ్ పంత్ మరో రకమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాడు. కీపింగ్ చేసే సమయంలో వికెట్ వెనుక నిలబడి చేస్తున్న సరదా కామెంట్లు మైకు ద్వారా విని టీవీ […]

Update: 2021-02-14 08:46 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అతడు బ్యాటింగ్ చేస్తుంటే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు టీవీల ముందు కూర్చున్న క్రికెట్ అభిమానులు సైతం ఆనందంతో గంతులేస్తున్నారు. అయితే టీవీల ముందు కూర్చొని చూస్తున్న ప్రేక్షకులకు రిషబ్ పంత్ మరో రకమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాడు. కీపింగ్ చేసే సమయంలో వికెట్ వెనుక నిలబడి చేస్తున్న సరదా కామెంట్లు మైకు ద్వారా విని టీవీ ప్రేక్షకులు నవ్వాపుకోలేక పోతున్నారు. చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసే సమయంలో పంత్ కీపింగ్ చేస్తూ చేసిన కామెంట్లు, చేష్టలు తెగ నవ్వు తెప్పించాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మాన్ సింగిల్ కోసం పరుగు తీస్తుంటే వెకిలిగా నవ్వి వారిని డిస్ట్రబ్ చేసే ప్రయత్నంచేశాడు. ట్విట్టర్‌లో రిషబ్ కామెంట్లపై జోకులు కూడా పేలుతున్నాయి.

‘నేను ఒక ప్రత్యేకమైన సెటప్ పెట్టుకొని రిషబ్ పంత్ మైకులో మాట్లాడే మాటలు వింటాను’ అని ఒకరంటే.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ను రిషబ్ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాడు’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘రిషబ్ చేసే మోటివేషనల్ కామెంట్లు సద్దురు కంటే చాలా బాగున్నాయి’ అని వీరు శర్మ అనే అభిమాని ట్వీట్ చేశాడు. మరొకరైతే ‘స్టార్ స్పోర్ట్స్ రిషబ్ పంత్ కామెంట్రీ కోసం ఎక్స్‌ట్రా మనీ ఇస్తున్నట్లుంది. కామెంటేటర్ల కంటే అతడే ఎక్కువ వినోదాన్ని పంచుతున్నాడు’ అని సోరబ్జీత్ చటర్జీ ట్వీట్ చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ మ్యాచ్‌లు లేని సమయంలో రిషబ్ కామెంట్రీ చెప్పాలని నేను బీసీసీఐకి పిటిషన్ పెట్టుకుంటానంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘స్టార్ స్పోర్ట్స్ ఆ కామెంటేటర్లను ఆపేసి.. రిషబ్ పంత్ కీపింగ్ చేసేటప్పుడు వికెట్ల మైక్ సౌండ్ పెంచితే చాలు’ అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. ఇలా రిషబ్ వికెట్ల వెనుక వేస్తున్ పంచ్‌లు, చేస్తున్న కామెంట్లు ఫీల్డ్‌లోని క్రికెటర్లనే కాకుండా టీవీల ముందు ఉన్న ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి.

Tags:    

Similar News