ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ నియమించబడ్డాడు. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఈ సీజన్‌కు రిషబ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు డీసీ సహయజమాని పార్ద్ జిందాల్ వెల్లడించారు. ‘శ్రేయస్ అయ్యర్ ఒక మంచి కెప్టెన్ అని మాకు తెలుసు. కానీ ఈ సంవత్సరం అతడి బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ సేవలను మిస్ అవుతున్నాము. త్వరలోనే […]

Update: 2021-03-30 11:19 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ నియమించబడ్డాడు. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఈ సీజన్‌కు రిషబ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు డీసీ సహయజమాని పార్ద్ జిందాల్ వెల్లడించారు. ‘శ్రేయస్ అయ్యర్ ఒక మంచి కెప్టెన్ అని మాకు తెలుసు. కానీ ఈ సంవత్సరం అతడి బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ సేవలను మిస్ అవుతున్నాము. త్వరలోనే ఆయన మైదానంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నాము. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించగలిగే సత్తా రిషబ్ పంత్‌కు ఉన్నదని మేం భావిస్తున్నారు. ఆ పదవికి అతడే సరైన చాయిస్ అని అనుకుంటున్నాము. ఢిల్లీ జట్టుకు అతడు గతంలో అందించిన సేవలు మరువలేనివి. ఈ సారి మరింత పెద్ద బాధ్యత అతడిపై ఉన్నది. ఢిల్లీ క్యాపిటల్స్, రిషబ్‌పంత్‌కు బెస్టాఫ్ లక్’ అని జిందాల్ చెప్పారు. మరోవైపు పంత్ నియామకంపై శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. పంత్ నియామకం బెస్ట్ చాయిస్ అని చెప్పాడు.

Tags:    

Similar News