భైంసా ఘటనలో 25 మందిపై కేసు

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్లకు కారణమైన వారిని గుర్తించిన పోలీసులు 25 మందిపై సోమవారం కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 300 మంది ప్రత్యేక పోలీసు బలగాలను ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం నుంచి బైంసా‌కు రప్పించారు. లాక్‌డౌన్ క్రమంగా సడలిస్తున్న వేళ అల్లర్లు చెలరేగడంతో భైంసాలో అప్రకటిత కర్ఫ్యూ తలపిస్తోంది. కరీంనగర్ రేంజ్ పోలీస్ డీఐజీ ప్రమోద్ కుమార్, నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం […]

Update: 2020-05-11 04:49 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్లకు కారణమైన వారిని గుర్తించిన పోలీసులు 25 మందిపై సోమవారం కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 300 మంది ప్రత్యేక పోలీసు బలగాలను ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం నుంచి బైంసా‌కు రప్పించారు. లాక్‌డౌన్ క్రమంగా సడలిస్తున్న వేళ అల్లర్లు చెలరేగడంతో భైంసాలో అప్రకటిత కర్ఫ్యూ తలపిస్తోంది. కరీంనగర్ రేంజ్ పోలీస్ డీఐజీ ప్రమోద్ కుమార్, నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం భైంసా పట్టణమంతా పోలీసు గుప్పిట ఉంది.

Tags:    

Similar News