రెహమాన్ కన్నీరు తుడిచిన సోషల్ మీడియా

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వల్ల ఎంతోమంది జీవితాలు కుదేలయ్యాయి. ఢాకాలో నివసిస్తున్న ఫజ్లూర్ రెహమాన్ పరిస్థితి కూడా అలాంటిదే. లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోవడంతో రిక్షా కార్మికుడిగా మారాడు. ఓ సారి కరోనా అతడి జీవనోపాధిని దూరం చేస్తే.. ఈసారి మున్సిపల్ అధికారులు అతడి జీవనోపాధి లేకుండా చేశాడు. బ్యాటరీతో నడిచే రిక్షాలను ఢాకాలో బ్యాన్ చేయడంతో అతడి రిక్షాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతడు గుండె పగిలేలా రోదించాడు. ఆ వీడియో సోషల్ […]

Update: 2020-10-10 06:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వల్ల ఎంతోమంది జీవితాలు కుదేలయ్యాయి. ఢాకాలో నివసిస్తున్న ఫజ్లూర్ రెహమాన్ పరిస్థితి కూడా అలాంటిదే. లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోవడంతో రిక్షా కార్మికుడిగా మారాడు. ఓ సారి కరోనా అతడి జీవనోపాధిని దూరం చేస్తే.. ఈసారి మున్సిపల్ అధికారులు అతడి జీవనోపాధి లేకుండా చేశాడు. బ్యాటరీతో నడిచే రిక్షాలను ఢాకాలో బ్యాన్ చేయడంతో అతడి రిక్షాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతడు గుండె పగిలేలా రోదించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. రెహమాన్‌కు మరో రూపంలో అదృష్టం కలిసొచ్చింది.

ఇటీవల ఢాకా సౌత్ సిటీ కార్పొరేషన్ (DSCC) మోటారు, బ్యాటరీలతో నడిచే రిక్షాలను రద్దు చేసింది. దాంతో ఇటీవలే బ్యాటరీ రిక్షా కొనుక్కుని జీవనోపాధి పొందుతున్న రెహమాన్ ఆశలపై డీఎస్‌సీసీ నీళ్లు చల్లింది. తన రిక్షాను వాళ్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతో రెహమాన్ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన బాధను ఓ నెటిజన్ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన షాప్నో(Shwapno) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాబిర్ హసన్.. రెహమాన్‌కు రెండు రిక్షాలు కొనివ్వడంతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చింది. అదేంటంటే.. తేజ్‌గావో అనే రెస్టారెంట్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌ కోసం తన రిక్షాలను వినియోగించాలనే ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవలే ఢిల్లీకి చెందిన ‘బాబా కా దాబా’ హోటల్ నిర్వాహకులకు చేయూతనిచ్చిన సోషల్ మీడియా.. మరోసారి రెహమాన్‌ విషయంలోనూ ఉపయోగపడింది.

Tags:    

Similar News