కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క జిల్లాలో దారుణం
దిశ, నూగురు వెంకటాపురం: రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్దిరోజుల నుంచి రైతుల కష్టాలు వర్ణనాతీతం. రైతులు అష్టకష్టాలు పడుతుంటే.. ఇదే అదునుగా భావించిన కొంతమంది దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. మండల పరిధిలో కురిసిన వర్షాలకు రైతన్న కంట కన్నీరు కారుతోంది. చేతికందిన పంటపై వర్షం కురవడంతో మండలానికి చెందిన రైతులు కన్నీరు కారుస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాలు ధాన్యం కొనే పరిస్థితి లేకుండా ఉన్నదని.. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో […]
దిశ, నూగురు వెంకటాపురం: రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్దిరోజుల నుంచి రైతుల కష్టాలు వర్ణనాతీతం. రైతులు అష్టకష్టాలు పడుతుంటే.. ఇదే అదునుగా భావించిన కొంతమంది దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. మండల పరిధిలో కురిసిన వర్షాలకు రైతన్న కంట కన్నీరు కారుతోంది. చేతికందిన పంటపై వర్షం కురవడంతో మండలానికి చెందిన రైతులు కన్నీరు కారుస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాలు ధాన్యం కొనే పరిస్థితి లేకుండా ఉన్నదని.. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వరి కోత కోసే యంత్రాల యజమానులు నిర్ధిష్ట ధర కాకుండా ఇష్టమైన రేట్లు తీసుకోవడం.. కనీసం రసీదు కూడా ఇవ్వటంలేదు. మరోవైపు కొంతమంది దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.