అమిత్‌షాకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రిక్వెస్ట్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని అభిమానులే జీర్ణించుకోలేక పోతున్నారు.. ఇక పెండ్లి చేసుకోబోయే అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరికొద్ది నెలల్లో తనను వివాహం చేసుకుని జీవితాంతం ఒకరికి ఒకరం తోడుంటామని.. కడ వరకు ఆనందంగా కలిసి ఉంటామనే ఊహల్లో ఉన్న అమ్మాయి… అకస్మాత్తుగా కాబోయేవాడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే.. అసలు కారణమేంటో కూడా తెలియకపోతే .. ఎంత కుమిలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలోనే ఉంది హీరోయిన్ రియా చక్రవర్తి. సుశాంత్ […]

Update: 2020-07-17 01:55 GMT
అమిత్‌షాకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రిక్వెస్ట్
  • whatsapp icon

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని అభిమానులే జీర్ణించుకోలేక పోతున్నారు.. ఇక పెండ్లి చేసుకోబోయే అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరికొద్ది నెలల్లో తనను వివాహం చేసుకుని జీవితాంతం ఒకరికి ఒకరం తోడుంటామని.. కడ వరకు ఆనందంగా కలిసి ఉంటామనే ఊహల్లో ఉన్న అమ్మాయి… అకస్మాత్తుగా కాబోయేవాడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే.. అసలు కారణమేంటో కూడా తెలియకపోతే .. ఎంత కుమిలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలోనే ఉంది హీరోయిన్ రియా చక్రవర్తి.

సుశాంత్ మరణించి జులై 14 కు నెలరోజులు గడిచింది. అయినా కూడా అసలు సుశాంత్ ఆత్మహత్యకు కారణాలేంటో తెలియరాలేదు. మరో వైపు దావూద్ ఇబ్రహీం గ్యాంగే సుశాంత్‌ను మర్డర్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి? అదే నిజమైతే ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది?. అసలు సుశాంత్‌ది హత్య? ఆత్మహత్య? తన మరణం వెనుకున్న కారణమేంటి? అనేది తెలియాలని.. దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసింది రియా. సుశాంత్ చనిపోయి నెలరోజులపైనే అయిందన్న రియా.. దీని వెనుక కారణమేంటో త్వరలోనే బయటపడుతుందని.. తనకు ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని తెలిపింది.. అసలు సుశాంత్ ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలని ఉందని చెప్పింది రియా.

Tags:    

Similar News