ఆర్జీవీ మిస్సింగ్.. అనుమానితులు?

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద వర్మ మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. లాక్‌డౌన్ నుంచి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న వర్మ.. ‘ఆర్జీవీ మిస్సింగ్’ పేరుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు వర్మ. అసలు కథ ఏంటంటే వర్మ అనుకోకుండా మిస్ అయ్యాడు అనేది బ్రేకింగ్ కాగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగాస్టార్ కుటుంబం, మాజీ సీఎం, తన కొడుకు మీద అనుమానం వ్యక్తం చేస్తారు. ఆదివారం పవన్ […]

Update: 2020-10-03 06:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద వర్మ మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. లాక్‌డౌన్ నుంచి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న వర్మ.. ‘ఆర్జీవీ మిస్సింగ్’ పేరుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు వర్మ. అసలు కథ ఏంటంటే వర్మ అనుకోకుండా మిస్ అయ్యాడు అనేది బ్రేకింగ్ కాగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగాస్టార్ కుటుంబం, మాజీ సీఎం, తన కొడుకు మీద అనుమానం వ్యక్తం చేస్తారు. ఆదివారం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్ రివిల్ చేయనుండగా.. ఆర్జీవీ నటిస్తున్న రెండో చిత్రం ఇదే.

కాగా ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు తీసిన వర్మ.. ఇప్పుడు అందరినీ ఒకేసారి టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నాడు. వర్మ మూవీ ఔట్‌పుట్ ఎలా ఉన్నా సరే.. సినిమా మీద హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతాడు. ఆడియన్స్ కూడా అంతే.. సినిమా ఎలా ఉన్నా సరే.. వర్మ తీశాడు కాబట్టి అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ఆశిస్తుంటారు.

Tags:    

Similar News