‘శివ’ లాగే ‘పవర్ స్టార్’ లోగో
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే వివాదంగా మారడంలో వింతేమీ లేదు. అదే వివాదం ప్రమోషన్‌గా మారడంలో కొత్తేమీ లేదు. అయితే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడమే మరింత కొత్తగా ఉంది నెటిజన్లకు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టి మరీ సినిమా తీస్తున్న వర్మ.. గురువారం ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. దీంతో పాటు రోజు మొత్తం సినిమా అప్ డేట్స్ ఇస్తూనే ఉన్న వర్మ.. […]
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే వివాదంగా మారడంలో వింతేమీ లేదు. అదే వివాదం ప్రమోషన్‌గా మారడంలో కొత్తేమీ లేదు. అయితే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడమే మరింత కొత్తగా ఉంది నెటిజన్లకు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టి మరీ సినిమా తీస్తున్న వర్మ.. గురువారం ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. దీంతో పాటు రోజు మొత్తం సినిమా అప్ డేట్స్ ఇస్తూనే ఉన్న వర్మ.. పవన్ విత్ వైఫ్, పవన్ విత్ చిరంజీవి, పవన్ విత్ డైరెక్టర్ త్రివిక్రమ్ అంటూ ఫొటోలు రిలీజ్ చేశాడు. అన్నిట్లో హై లైట్ ఏంటంటే.. ఎన్నికల ఫలితాల తర్వాత కథ క్యాప్షన్‌తో పాటు పవర్ స్టార్ టైటిల్ పోస్టర్‌లో టీ గ్లాస్ యాడ్ చేయడం.
దీన్ని చూస్తుంటేనే ఆటోమేటిక్‌గా జనసేన పార్టీ చిహ్నం, రాజకీయ నేపథ్యం అని అర్థం అవుతుండగా.. కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వర్మ ఈ విషయంపై తనదైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చాడు. ‘పవర్ స్టార్ లోగో మధ్యలో టీ గ్లాస్ పెట్టేందుకు రాజకీయ కారణాలు ఏమి లేవన్నారు. కేవలం ఈ సినిమాలో హీరో తరుచూ టీ తాగుతూ ఉంటాడు కాబట్టి యాడ్ చేసినట్లు చెప్పాడు. శివ సినిమాలో హీరో ఫైటింగ్ కోసం సైకిల్ చైన్ వినియోగిస్తుంటాడు కాబట్టి లోగోలో సైకిల్ చెయిన్ పెట్టినట్లే ఈ సినిమా హీరో హాబిట్ లోగోలో యాడ్ చేశాం’ అని వివరించాడు వర్మ.