గోగినేనికి వర్మ కౌంటర్..
రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చెప్పాలనుకున్నది చెప్పడం.. అది కాస్త వివాదంగా మారడం షరా మూమూలే. ఇప్పుడు అలాంటి మరో వివాదమే తెరపై రావడం గమనార్హం. ‘ది మ్యాన్ హు కిల్డ్ గాంధీ’ పేరుతో సినిమా చేస్తున్న వర్మ.. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే ఫొటోలో గాంధీ, గాడ్సే ఫొటోలను కలిపి పెట్టడమే ఇందుకు కారణం. కాగా దీనిపై సామాజిక కార్యకర్త బాబు గోగినేని […]
రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చెప్పాలనుకున్నది చెప్పడం.. అది కాస్త వివాదంగా మారడం షరా మూమూలే. ఇప్పుడు అలాంటి మరో వివాదమే తెరపై రావడం గమనార్హం. ‘ది మ్యాన్ హు కిల్డ్ గాంధీ’ పేరుతో సినిమా చేస్తున్న వర్మ.. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే ఫొటోలో గాంధీ, గాడ్సే ఫొటోలను కలిపి పెట్టడమే ఇందుకు కారణం. కాగా దీనిపై సామాజిక కార్యకర్త బాబు గోగినేని వర్మను నిలదీశారు.
ఒకే ఫొటోలో హత్య చేయబడిన గాంధీ, హత్య చేసిన గాడ్సేను మార్ఫ్ చేసి పెట్టి ఎలాంటి మెస్సేజ్ ఇద్దామనుకుంటున్నారు ? అని ప్రశ్నించారు. ఇది మనిషి జీవనాన్నే అవమానపరిచినట్లు అవుతుందన్నారు. వెంటనే ఫస్ట్ లుక్ ఫొటోను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశాడు.
కాగా దీనిపై స్పందించిన వర్మ.. ఫస్ట్ లుక్ ఫొటో ఎందుకలా మార్ఫ్ చేయాల్సి వచ్చిందో సినిమా చూశాక అర్థమవుతుందిలే అన్నాడు. అయినా ‘మీరు ఎలాగైతే దేవున్ని నమ్మేవారిని కించపరుస్తూ మీ హక్కని అంటారో.. అలాగే నా హక్కుల పరిధిలో నేను ఆర్టిస్టిక్ విజన్‌తో సినిమా చేస్తున్నా’ అని చెప్పాడు. అయినా ‘సినిమా చూడకముందే ఇదంతా అవసరమా.. బీర్ వేస్తూ చిల్ అయిపో చెప్తా’ అంటూ గోగినేనికి సలహా ఇచ్చాడు వర్మ.