దొంగ అవతారమెత్తిన VRO..

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వీఆర్వో దొంగతనం అవతారమెత్తాడు. తన తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో MRO ఆఫీసు నుంచి రాత్రి వేళల్లో రెవెన్యూ రికార్డులను మాయం చేసేందుకు యత్నించాడు. గమనించిన స్థానికులు అతన్నిఅడ్డుకున్నారు. దీంతో సదరు రికార్డులను అక్కడే వదిలేసి అతను పరారయ్యాడు. వివరాల్లోకివెళితే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వీఆర్వో నర్సింహ మంగళవారం రాత్రి తహసీల్దార్ కార్యాలయం నుంచి తన పరిధిలోని రెవెన్యూ రికార్డులను మాయం చేసేందుకు ప్రయత్నించాడు. రెవెన్యూ రికార్డులను […]

Update: 2020-09-08 22:39 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వీఆర్వో దొంగతనం అవతారమెత్తాడు. తన తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో MRO ఆఫీసు నుంచి రాత్రి వేళల్లో రెవెన్యూ రికార్డులను మాయం చేసేందుకు యత్నించాడు. గమనించిన స్థానికులు అతన్నిఅడ్డుకున్నారు. దీంతో సదరు రికార్డులను అక్కడే వదిలేసి అతను పరారయ్యాడు. వివరాల్లోకివెళితే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వీఆర్వో నర్సింహ మంగళవారం రాత్రి తహసీల్దార్ కార్యాలయం నుంచి తన పరిధిలోని రెవెన్యూ రికార్డులను మాయం చేసేందుకు ప్రయత్నించాడు.

రెవెన్యూ రికార్డులను తీసుకుని బయటకు వచ్చిన VRO నర్సింహను స్థానికులు అడ్డుకున్నారు. తనను ఎందుకు ఆపుతున్నారని వీఆర్వో వారితో వాగ్వివాదానికి దిగాడు. రెవెన్యూ రికార్డులను ఎక్కడికి తీసుకెళ్తున్నవంటూ స్థానికులు గట్టిగా నిలదీయడంతో సదరు అధికారి రెవెన్యూ రికార్డులను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ వ్యవహారంపై చిట్యాల తహసీల్దార్ స్పందించారు. రెవెన్యూ రికార్డులను దొంగిలించడానికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. వీఆర్వో నర్సింహపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని MRO తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తానని వెల్లడించారు.

Tags:    

Similar News