స్పెషల్ స్కేలు ఇవ్వాలి.. సీఎస్‌కు రెవెన్యూ ఎంప్లాయిస్ రిక్వెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: పీఆర్సీ కోసం ఎంతో ఎదురుచూశాం.. రిపోర్ట్ నిరాశపరిచింది. మాది అన్నిశాఖల కంటే పెద్దది. ధరణి పోర్టల్‌తో 24గంటలు పనిచేస్తున్నాం. అందుకే మాకు ప్రత్యేక స్కేలు ఇవ్వాలని రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం బీఆర్కే భవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటితో 45నిమిషాల పాటు నేతలు సమావేశమయ్యారు. అనంతరం సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తహశీల్దార్లు తీవ్ర పని ఒత్తిడితో ఉన్నారని, విపత్తులు, ఎన్నికలు, ప్రోటోకాల్, […]
దిశ, తెలంగాణ బ్యూరో: పీఆర్సీ కోసం ఎంతో ఎదురుచూశాం.. రిపోర్ట్ నిరాశపరిచింది. మాది అన్నిశాఖల కంటే పెద్దది. ధరణి పోర్టల్‌తో 24గంటలు పనిచేస్తున్నాం. అందుకే మాకు ప్రత్యేక స్కేలు ఇవ్వాలని రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం బీఆర్కే భవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటితో 45నిమిషాల పాటు నేతలు సమావేశమయ్యారు. అనంతరం సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తహశీల్దార్లు తీవ్ర పని ఒత్తిడితో ఉన్నారని, విపత్తులు, ఎన్నికలు, ప్రోటోకాల్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, భూ వివాదాల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, భూ సేకరణ, సివిల్ సప్లయిస్ వంటి అనేక రకాల విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. అందుకే ప్రత్యేక స్కేలు అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. పీఆర్సీ నివేదిక రిపోర్ట్ ఫైనల్ కాదని, సీఎం కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. 65శాతం ఫిట్‌మెంట్ కావాలని, హెచ్ఆర్ఏ కూడా పెంచాలన్నారు.
సంఘం డిమాండ్లు:
– ఎంపీడీఓ, జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్, ఇరిగేషన్ ఏఈలకు తహశీల్దార్ల కంటే వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక బాధ్యతలు ఉన్న తహశీల్దార్లకు వేతన స్కేలు తక్కువగా ఉంది.
– ఆర్డీవోలు, నాయబ్ తహశీల్దార్లు, గిర్దావర్లకు ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు కంటే తక్కువ వేతనాలు ఉన్నాయి.
– వీఆర్ఏలు గౌరవ వేతనంతో పని చేస్తున్నారు. వారికి వేతన స్కేలు ఇవ్వాలి.
– వీఆర్వోల వ్యవస్థ రద్దయ్యింది. ఇకనైనా రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలి.
ప్రతిపాదిత అంశాలు
– ఫిట్మెంట్: 65శాతం
– హెచ్ఆర్ఏ: జీహెచ్ఎంసీ పరిధిలో 35శాతం, జిల్లా, మున్సిపల్ ఏరియాలో 30శాతం, డివిజన్ల ఏరియాలో 25శాతం, ఇతర ప్రాంతాల్లో 20శాతం ఇవ్వాలి.
– మెడికల్ అలవెన్స్: రూ.600 సరిపోవు. రిటైర్డ్ ఉద్యోగులకు 65 ఏండ్లు దాటిన వారికి రూ.2వేలు, 75 ఏండ్లు దాటిన వారికి రూ.3 వేలు ఇవ్వాలి