టీఆర్ఎస్ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
దిశ ప్రతినిధి, వరంగల్: పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతుండటంతో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని రేవంత్‌రెడ్డి చక్కదిద్దుతాడనే అంచనాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. కేసీఆర్‌కు తగ్గ రీతిలో తనదైన దూకుడుతో ఢీ కొట్టగల నాయకుడు రేవంత్ అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు బలంగా విశ్వసిస్తుండటం గమనార్హం. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం వద్దని వాదించిన సీనియర్లను ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఇళ్లకు వెళ్లి కలుస్తూ మద్దతు కూడ గట్టుకునే […]
దిశ ప్రతినిధి, వరంగల్: పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతుండటంతో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని రేవంత్‌రెడ్డి చక్కదిద్దుతాడనే అంచనాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. కేసీఆర్‌కు తగ్గ రీతిలో తనదైన దూకుడుతో ఢీ కొట్టగల నాయకుడు రేవంత్ అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు బలంగా విశ్వసిస్తుండటం గమనార్హం. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం వద్దని వాదించిన సీనియర్లను ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఇళ్లకు వెళ్లి కలుస్తూ మద్దతు కూడ గట్టుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇంట గెలిచి.. రచ్చ గెలవాలనే వ్యూహాత్మక వైఖరితో వెళ్తున్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రణాళిక ఎలా ఉండబోతోంది..? పార్టీని చక్కదిద్దేందుకు రేవంత్ రెడ్డి అనుసరించే మార్గాలపై ఇప్పుడు ఆ పార్టీలోనే కాదు.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోందని చెప్పాలి. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలపై చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి గులాబీ గూటికి చేరుకున్న ఎమ్మెల్యేలపై రేవంత్ గురి పెట్టినట్లుగా స్పష్టమవుతోంది.
వరంగల్ జిల్లా రాజకీయాల విషయానికి వస్తే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని రేవంత్ టార్గెట్ చేసినట్లుగా అర్థమవుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను వదలబోమన్న రీతిలో రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈనెల 7 తర్వాత అసలు రాజకీయ ప్రయాణం మొదలవుతుందని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను ఉరికిస్తామని కామెంట్ చేయడం విశేషం. రేవంత్‌కు అత్యంత సన్నిహితుడైన గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు ఓరుగల్లు రాజకీయాల్లో ప్రాధాన్యం సతరించుకున్నాయి. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అంటూ ఎమ్మెల్యే గండ్ర చేసిన వ్యాఖ్యల అనంతరం రేవంత్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ కొనసాగబోతోందన్న సంకేతం వెలువడినట్లయింది. గండ్రను ఓడించేందుకు రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారన్న చర్చ ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతోంది. ఈ వ్యవహారంపై మున్ముందు ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.